News April 19, 2025
వ్యవసాయంలో నూతన సాంకేతికతను అలవర్చుకోవాలి: రాజనర్సింహ

రైతులందరూ నూతన సాంకేతిక నలబరుచుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారంలో అయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయాన్ని కాంగ్రెస్ పార్టీ పండగల మార్చిందన్నారు. రాయికోడ్ ప్రాంతానికి లిఫ్టు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
Similar News
News April 19, 2025
జేఈఈ మైన్స్ ఫలితాల్లో హార్వెస్ట్ ప్రభంజనం

JEE మెయిన్స్ ఫలితాల్లో ఖమ్మం హార్వెస్ట్ కళాశాల ప్రభంజనం సృష్టించింది. జాతీయ స్థాయిలో 17వ ర్యాంకు సాధించడమే కాకుండా జిల్లా ప్రథమ, తృతీయ స్థానాలు సాధించింది. హార్వెస్ట్ కళాశాల నుంచి 40% విద్యార్థులు అడ్వాన్స్ పరీక్షకు ఉత్తీర్ణత సాధించడం మరో విశేషం. అటు ఈ కళాశాల విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో సీటు పొందారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది.
News April 19, 2025
పార్వతీపురం: ‘రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేయించుకోవాలి’

రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా 8,16,859 మంది రేషన్ కార్డులు దారుల్లో 7,49,481 మంది ఈ కేవైసీ చేయించుకున్నారని తెలిపారు. 5 ఏళ్ల లోపు వారికి అవసరం లేదు అన్నారు. 54,392 మంది రేషన్ కార్డుదారులు సమీప డీలర్ వద్ద గాని, MDU ఆపరేటర్ వద్ద గాని ఈనెల 30 తేదీలోగా నమోదు చేసుకోవాలన్నారు.
News April 19, 2025
హైదరాబాద్: సీఎం పర్మిషన్ కోసం వెయిటింగ్

నగరంలో అక్కడక్కడా రోడ్లు దెబ్బతినగా వాటికి మరమ్మతులు చేయాల్సి ఉందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఆ పనుల కోసం టెండర్లు పిలవాల్సి ఉందంటున్నారు. నగరంలో దాదాపు 744 కిలోమీటర్లు రోడ్ల మరమ్మతులకు రూ.2,491 కోట్లు కావాలని అందుకోసం ఇప్పటికే సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు పంపామని చెబుతున్నారు. సీఎం రేవంత్ అనుమతి లభించిన తరువాత పనులు ప్రారంభం అవుతాయని అంటున్నారు.