News September 17, 2025
వ్యవసాయ కూలీ టీచర్ ఉద్యోగానికి ఎంపిక

వ్యవసాయ పనులు చేస్తూ తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ మెగా డీఎస్సీలో రేపల్లెకు చెందిన వ్యవసాయ కూలీ 15వ ర్యాంకు సాధించారు. రేపల్లెకు చెందిన సొంటి సురేష్ స్కూల్ అసిస్టెంట్ (సామాజిక శాస్త్రం) విభాగంలో 80.56 మార్కులతో 15వ ర్యాంకు సాధించి 2 పోస్టులకు ఎంపికయ్యారు. సురేష్ మాట్లాడుతూ.. వ్యవసాయం తనకు క్రమశిక్షణ నేర్పిందన్నారు. కష్టపడి చదివితే ఎవరికైనా విజయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
Similar News
News September 17, 2025
చరిత్రాత్మక ఘట్టం.. పార్టీకో పేరు!

TG: నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్ 1948, SEP 17న భారత సమాఖ్యలో విలీనమైంది. ఈ చరిత్రాత్మక రోజును ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో నిర్వహిస్తోంది. గత BRS ప్రభుత్వం ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ అని, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ‘ప్రజా పాలన దినోత్సవం’ అని పేర్లు పెట్టాయి. అటు BJP నేతృత్వంలోని కేంద్రం ఐదేళ్లుగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ పేరిట వేడుకలు నిర్వహిస్తోంది. పేరేదైనా.. ఉద్దేశం అమరులను స్మరించుకోవడమే.
News September 17, 2025
వరంగల్ కోటలో జాతీయ జెండా ఎగరవేసి నేలకొరిగిన మొగిలయ్య

వరంగల్ కోట నివాసి మొగిలయ్య మొదటి నుంచి తెలంగాణ విమోచన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ఉద్యమంలో భాగంగా సర్వోదయ సంఘం పక్షాన ప్రతివారం వరంగల్ కోటలో జాతీయ జెండాను ఎగరవేసే కార్యక్రమాన్ని చేపట్టాడు. 1946 ఆగస్టు 11న కోటలో జాతీయ జెండా ఎగరవేసిన తర్వాత కాశీం షరీఫ్ నాయకత్వంలో రజాకార్లు హఠాత్తుగా దాడి చేశారు. కత్తిపోట్లకు గురై మొగిలయ్య నేలకొరిగాడు.
News September 17, 2025
సంగారెడ్డి: ఉపాధ్యాయుల శిక్షణ వాయిదా

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు నేటి నుంచి జరగాల్సిన శిక్షణ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. శిక్షణ కార్యక్రమం తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని జిల్లాలోని ఉపాధ్యాయులందరూ గమనించాలని సూచించారు.