News July 29, 2024

వ్యవసాయ పనుల్లో రైతన్నలు బిజీ.. బిజీ

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతన్నలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు నాట్లు వేయడంలో రైతన్నలు వ్యవసాయ పొలంలో బిజీ.. బిజీగా గడుపుతున్నారు. దుక్కులు సిద్ధం చేయడంతో పాటు కంది, జొన్న పంటలకు రైతులు కలుపుతీత, ఎరువులు వేస్తున్నారు. విత్తనాల కోసం రైతులు ఫర్టిలైజర్‌ దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. విత్తనాలు కొనేటప్పుడు రసీదు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు.

Similar News

News February 23, 2026

MBNR: పీఎం శ్రీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సెంట్రల్ అబ్జర్వర్ ఫరీదా మహమ్మద్ బాలానగర్, రాజాపూర్ పాఠశాలలను తనిఖీ చేసి నిధుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో పనుల నాణ్యత, గడువుపై కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు.

News February 23, 2026

పాలమూరు: మత్తు వదలండి.. మైదానాలు చేరండి: మంత్రి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన సెకండ్ ఎడిషన్ సీఎం కప్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకలకు మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రపంచాన్ని వదిలి క్రీడలపై ధ్యాస పెడితే ప్రపంచం మొత్తం తమ వైపు చూస్తుందన్నారు. 33 జిల్లాల నుంచి సుమారు 1,200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

News February 23, 2026

MBNR: సౌత్ జోన్.. పీయూలో చెస్ ఎంపికలు

image

పీయూలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు చెస్ (పురుషుల) ఎంపికలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ జీఎన్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. యూనివర్సిటీలో అన్ని సదుపాయాలు ఉన్నాయని, క్రీడాకారులు ప్రతిభ చాటి యూనివర్సిటీకి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ పూస రమేశ్ బాబు, పీడీ డా.వై.శ్రీనివాసులు, కోచ్‌లు పాల్గొన్నారు. ఎంపికైన వారు మార్చి 1న నుంచి తమిళనాడులో జరిగే టోర్నీలో పాల్గొననున్నారు.