News September 11, 2025

వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌గా సంఘం గౌరవ అధ్యక్షుడిగా శివారెడ్డి ఎన్నిక

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా నారాయణపేట మార్కెట్ యార్డు చైర్మన్ శివారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ మార్కెట్ చైర్‌పర్సన్ అనితారెడ్డి తెలిపారు. బుధవారం తన నివాసంలో జరిగిన సమావేశంలో ఈ కమిటీని ఎన్నుకున్నట్లు చెప్పారు. ఉపాధ్యక్షుడిగా రమణారావు, కార్యదర్శిగా హరిలింగం, కోశాధికారిగా రహమతుల్ల ఎన్నికయ్యారు.

Similar News

News April 18, 2026

నెల్లూరు: ఉద్యోగులకూ సమస్యలు

image

నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని తిక్కన ప్రాంగణంలో ఉద్యోగుల కోసం స్పెషల్ గ్రీవెన్స్ డే శుక్రవారం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు తరలి వచ్చారు. తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుకు వివరించారు. ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఇప్పటి వరకు 4 శుక్రవారాలు ఉద్యోగుల గ్రీవెన్స్ డే చేపట్టగా.. 235 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 172 పరిష్కారించారు.

News April 18, 2026

మారని కోల్‘కథ’.. ఇక ఇంటికేనా?

image

IPL 2026లో KKR పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. 6 మ్యాచుల్లో 5 ఓడగా, వర్షం వల్ల ఒకటి రద్దయింది. ఇంకా 8 మ్యాచులు మిగిలి ఉండటంతో కనీసం 7 గెలిస్తే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం టీమ్ ఆట తీరు చూస్తే అది అనుమానమే. ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తుందా అనేలా తయారైంది పరిస్థితి. అసాధారణ రీతిలో పుంజుకుంటే తప్ప ప్లే ఆఫ్స్ రేసులో నిలవడం దాదాపు అసాధ్యం. మీరేమంటారు?

News April 18, 2026

గాడిదలా నటించమని అడిగినా సరే..: ఆర్య

image

దర్శకులు బాల, పా.రంజిత్‌ను తాను ఎంతో నమ్ముతానని తమిళ హీరో ఆర్య చెప్పారు. వాళ్లతో సినిమాలకు స్క్రిప్ట్ పూర్తిగా వినాల్సిన అవసరం కూడా ఉండదని అన్నారు. ‘నాకు కథ చెప్పకుండానే వెట్టువమ్ మూవీని రంజిత్ తీస్తున్నారు. బాల సర్ నన్ను గాడిదగా చేయమన్నా సరే చేసేస్తా. నెల రోజుల్లో అఘోరీ లుక్(నేనే దేవుడ్ని) కోసం సిద్ధమవ్వాలని చెప్పి నన్ను హీరోగా సెలక్ట్ చేశారు’ అని ‘మిస్టర్ ఎక్స్’ ప్రమోషన్స్‌లో ఆయన చెప్పారు.