News February 1, 2025
వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో సోలార్ ప్లాంట్‌లు

వ్యవసాయయోగ్యం కాని భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్‌ల ఏర్పాటుకు రైతులు ముందుకు రావాలని భద్రాద్రి SE మహేందర్ కోరారు. 500 కిలోవాట్ల నుంచి 4వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ప్లాంట్‌లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను NPDCL నిర్ణయించిన టారిఫ్ ఆధారంగా విద్యుత్ డిస్కంలు కొనుగోలు చేస్తాయన్నారు. www.tgredco.telangana.gov.inవెబ్‌సైట్‌లో 22లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News July 6, 2025
GHMC ఆస్తులపై DGPS సర్వే

గ్రేటర్ HYDలో GHMC ఆస్తుల డీజీపీఎస్ సర్వేకు రంగం సిద్ధమైంది. చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో స్థిరాస్తులు, ఓపెన్ లేఅవుట్లు, పార్కులు, స్థలాలు కమ్యూనిటీ హాల్స్ సహా అన్ని వివరాలను సర్వే చేయించనున్నారు. సర్వే డిజిటలైజేషన్ కోసం కన్సల్టెన్సీల నుంచి టెండర్లు ఆహ్వానించింది. కార్యాలయ భవనాల నుంచి మున్సిపల్ షాపుల దాకా అన్ని వివరాలు పొందుపరచునున్నారు.
News July 6, 2025
భద్రకాళి ఆలయంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ

భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్ పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తులు సజావుగా దర్శనం చేసుకునేందుకు గాను ముందస్తు చర్యలు తీసుకోవాలని మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ గోపికి ఏఎస్పీ పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.
News July 6, 2025
LEAP యాప్‌లో పొందుపరచాలి: కలెక్టర్

ఈనెల 10న ఏలూరు జిల్లాలో జరిగే మెగా పేరెంట్స్ మీట్‌కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌లో ఆమె ఏర్పాట్లను సమీక్షించారు. ‘LEAP యాప్’లో కార్యక్రమ వివరాలను పొందుపరచాలని, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య నివేదికలను అందించాలన్నారు. మానసిక ఆరోగ్యం, సైబర్ క్రైమ్, డ్రగ్స్ వ్యతిరేకత, పిల్లల పురోగతిపై ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించాలన్నారు.