News April 2, 2025

వ్యాధుల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

కీటక జనిత వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కింద పలు శాఖల అధికారులతో కీటక జనిత వ్యాధుల నియంత్రణపై కలెక్టరేట్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. గతేడాది చేపట్టిన మలేరియా నివారణ చర్యలపై ఆరా తీశారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ మరణాలు జరగకూడదన్నారు. మలేరియా ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి పెట్టి నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

Similar News

News April 3, 2025

కడప వాసులకు గర్వకారణం: తులసిరెడ్డి

image

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గాలి నాణ్యత నివేదికలో కడప నగరం మొదటి స్థానంలో ఉండటం హర్షణీయమని రాజ్యసభ మాజీ సభ్యులు తులసి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆయన వేంపల్లిలో మాట్లాడారు. 42 పాయింట్లతో, కడప నగరం రాష్ట్రంలో అత్యంత క్లీన్ ఎయిర్ నగరంగా ఎంపిక కావటం సంతోషమన్నారు, ఇది కడప వాసులకు గర్వకారణమన్నారు. 52 పాయింట్లతో నెల్లూరు, 120 పాయింట్లతో విశాఖ చివరి స్థానంలో ఉండటం దారుణం అన్నారు.

News April 3, 2025

KNR: LRS రిబేట్ సదుపాయం గడువు పొడిగింపు: కలెక్టర్

image

అనధికార లే ఔట్ల క్రమబద్ధీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్.ఆర్.ఎస్‌ 25 శాతం రాయితీ సదుపాయాన్ని పొడిగించిందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మార్చి 31 నాటికి ఈ గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్ గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించిందని అన్నారు. జిల్లాలోని అర్హులైన వారందరూ ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 3, 2025

సిరిసిల్ల: పది పరీక్షలు ప్రశాంతం

image

సిరిసిల్ల జిల్లాలో ఒకేషనల్ పదవ తరగతి పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయని సిరిసిల్ల డీఈవో జనార్దన్ రావు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మొత్తం జిల్లాలో 979 మంది విద్యార్థులకూ 977 మంది విద్యార్థులు హాజరయ్యారని స్పష్టం చేశారు. ఇద్దరు విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం విద్యార్థుల హాజరు శాతం 99.80గా నమోదయిందని తెలిపారు.

error: Content is protected !!