News August 18, 2025
వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: నిర్మల్ అడిషనల్ కలెక్టర్

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. సోమవారం మామడ మండలం పరిమండల్ గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి రాజేందర్, ఎంపీడీవో సుశీల్ రెడ్డి, డాక్టర్ మౌనిక పాల్గొన్నారు.
Similar News
News August 18, 2025
సంగారెడ్డి: పోలీస్ ప్రజావాణికి 12 దరఖాస్తులు

సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఎస్పీ పరితోష్ పంకజ్ వినతిపత్రాలు స్వీకరించారు. మొత్తం 12 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐలకు ఫోన్‌లో ఎస్పీ ఆదేశించారు.
News August 18, 2025
కేంద్రమంత్రిని మంత్రిని కలిసిన మినిస్టర్ దుర్గేశ్

న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను మంత్రి కందుల దుర్గేశ్
సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధిపై చర్చించారు. లేపాక్షిలో కల్చరల్ సెంటర్ రూ.103కోట్లు, లంబసింగిలో ఎక్స్పీరియన్స్ సెంటర్ & టూరిజం అభివృద్ధి రూ.99.87 కోట్లు, బుద్ధిస్ట్ సర్క్యూట్ ప్రాజెక్టుల డీపీఆర్‌ను మంత్రికి సమర్పించారు.
News August 18, 2025
పార్వతీపురం జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు

పార్వతీపురం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా మంగళవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ఒక రోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం వర్షాల కారణంగా విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. >Share it