News August 23, 2025

శంకరపట్నం: పశువుల పండుగ రోజే పశువుల చోరీ

image

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కాచాపూర్, గొల్లపల్లి గ్రామాల్లో పశువుల పండుగ రోజైన శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు పశువులను ఎత్తుకెళ్లారు. బావి దగ్గరి పశువుల పాకల వద్ద ఈ చోరీ జరిగింది. బాధిత రైతులు దుఃఖంతో కన్నీటిపర్యంతమై, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News August 24, 2025

మట్టి గణపతిని పూజిద్దాం: కలెక్టర్ రాహుల్ రాజ్

image

‘మట్టి గణపతిని పూజిద్దాం.. ప్రకృతిని కాపాడదాం’ అని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్‌లో కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కార్యాలయం రూపొందించిన గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలన్నారు. చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని, పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు సూచించారు.

News August 24, 2025

కూలీ, వార్-2 కలెక్షన్లు ఎంతంటే?

image

రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కూలీ’ విడుదలైన 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. 74% రికవరీ చేసిందని, మరో రూ.80 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నాయి. మరోవైపు NTR, హృతిక్ నటించిన ‘వార్-2’ వరల్డ్ వైడ్‌గా రూ.314 కోట్లకు పైగా వసూలు చేసినట్లు వెల్లడించాయి. ఈ రెండు చిత్రాలకు మిక్స్‌డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

News August 24, 2025

కామారెడ్డి: కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలి

image

పెండింగులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని జిల్లా న్యాయ సేవా అథారిటీ ఛైర్మన్ వరప్రసాద్ సూచించారు. శనివారం జిల్లా న్యాయ సేవ అథారిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో సాధ్యమైన అన్ని కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఎస్పీ రాజేశ్ చంద్ర పాల్గొన్నారు.