News December 15, 2025

శంకర్‌పల్లి: పల్లె లత యాదిలో గెలిపించారు!

image

గుండెపోటుతో మరణించిన మాసానిగూడ గ్రామ 8వ వార్డు మెంబర్ అభ్యర్థిని పల్లె లత (42)ను వార్డు ప్రజలు గెలిపించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో హుషారుగా పాల్గొన్న ఆమె అస్వస్థతకు గురికాగా కుటుంబీకులు శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి షిఫ్ట్ చేయగా చికిత్స పొందుతూ డిసెంబర్ 7న మృతి చెందారు. కాగా, నేటి ఫలితాల్లో ఆమెకు 30 ఓట్ల ఆధిక్యం వచ్చింది.

Similar News

News April 5, 2026

భారీగా తగ్గిన ధరలు.. రూ.100కే 8 కేజీలు

image

ఉల్లి ధరలు భారీగా పడిపోతున్నాయి. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల రూ.100కే 8 కేజీల ఉల్లి అమ్ముతున్నారు. అటు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నెల కిందటి వరకు క్వింటా రూ.2వేలు ఉండగా ఇప్పుడు రూ.800 నుంచి రూ.1,400 మాత్రమే పలుకుతోంది. మరి మీ ఏరియాలో ఉల్లి రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.

News April 5, 2026

మహనీయుల ఆశయాల బాటలో పయనిద్దాం: కలెక్టర్

image

ఎన్టీఆర్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ లక్ష్మీశా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహనీయుల జీవిత చరిత్రలను స్ఫూర్తిగా తీసుకొని, విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

News April 5, 2026

ట్రంప్ పర్మిషన్ లేకపోతే ఆయిల్ కూడా కొనలేరు: రాహుల్

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్మిషన్ లేకుండా ఇండియా కనీసం చమురు కూడా కొనలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘మోదీ కెరీర్ ఎప్పుడైనా ముగించేస్తానని ట్రంప్ ఓపెన్‌గానే అన్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మోదీకి సంబంధించిన నిజాలున్నాయి. దీంతో ఇండియా ఇంధన భద్రత, డేటాను ట్రంప్ చేతుల్లో ఆయన పెట్టారు. రాజీపడటం వల్లే ఇదంతా జరిగింది’ అని అస్సాంలోని గోలాఘాట్‌లో అన్నారు.