News March 5, 2025

శంబరలో తగ్గని భక్తుల రద్దీ

image

శంబర పోలమాంబ అమ్మవారి ఆరోవారం జాతర మంగళవారం ఘనంగా జరిగింది. చదురుగుడి, వనంగుడి వద్దకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. పలువురు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణ అధికారి వీవీ సూర్యనారాయణ తెలిపారు.

Similar News

News September 18, 2025

కొండాపూర్: గులాబీ మొక్కకు పూసిన విద్యుత్ దీపాలు

image

కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఒక అద్భుత దృశ్యం కెమెరాకు చిక్కింది. ఒక గులాబీ మొక్కకు పువ్వులకు బదులుగా నక్షత్రాలు వికసించినట్లుగా ఆ చిత్రం ఉంది. గులాబీ మొక్కకు దూరంలో ఉన్న రెండు ఇళ్ల విద్యుత్ దీపాలు కెమెరాకు ఇలా కనిపించాయి. ఈ చిత్రాన్ని చూసి చాలా మంది వీద్యుత్ దీపాలు గులాబీ మొక్కకు వికసించినట్లు ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

News September 18, 2025

VJA: దుర్గగుడి ఛైర్మన్ నియామకంపై తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి

image

దుర్గగుడి ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్‌గా బాలకృష్ణ అభిమాని బొర్రా గాంధీని నియమించడంపై స్థానిక TDP నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. YCP పాలనలో కేసులను ఎదుర్కొని, పార్టీ కోసం కష్టపడిన కీలక నేతలకు పదవి దక్కుతుందని ఆశించారు. అయితే, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా లేని గాంధీకి బాలకృష్ణ సిఫార్సుతోనే పదవి లభించిందని జిల్లా TDP నేతలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

News September 18, 2025

VJA: మీడియా పాసులు జారీలో.. కిందిస్థాయి సిబ్బంది అత్యుత్సాహం!

image

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాసులను జారీ చేసే విషయంలో ఓ ముఖ్య కార్యదర్శి PA, అదనపు కార్యదర్శి ఆఫీసు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. CMO నుంచి పాసులు జారీ చేయాలని ఆదేశాలు వచ్చినా కనీసం లెక్క చేయకపోవడం గమనార్హం. అసెంబ్లీ సందర్భంగా జరిగే చర్చలను, అందులోని అంశాలను ఎప్పటికప్పుడు చేరవేసే మీడియా పట్ల లెక్కలేని విధంగా వ్యవహరించడం సరైన విధానం కాదని రిపోర్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.