News January 26, 2025

శంబర జాతరకు 130 ప్రత్యేక బస్సులు

image

ఈనెల 27,28,29 తేదీల్లో జరిగే పార్వతీపురం జిల్లాలో జరిగే శంబర జాతరకు 130 ప్రత్యేక బస్సులు ఏర్పాటు విజయనగరం ప్రజారావాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం, ఎస్.కోట, సాలూరు డిపోలకు సంబంధించిన బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ బస్సులు గజపతినగరం, రామభద్రపురం, రాజాం, బొబ్బిలి, పార్వతీపురం రూట్లలో సర్వీస్ అందిస్తాయని పేర్కొన్నారు. 

Similar News

News March 13, 2025

విజయనగరం- భద్రాచలం ప్రత్యేక బస్సులు

image

విజయనగరం డిపో నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రానికి శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు 5వ తేదీ సాయంత్రం 4:30 కి బయలుదేరి 6వ తేదీ ఉదయం 5 గంటలకు భద్రాచలం చేరుకుని, అదే రోజు సాయంత్రం 5 గంటలకు భద్రాచలంలో బయలుదేరి 7వ తేదీన ఉదయం 5:30 గంటలకి విజయనగరం చేరుతాయన్నారు.

News March 13, 2025

VZM: 15,226 మంది లబ్ధిదారులకు గుడ్ న్యూస్

image

నిర్మాణం మ‌ధ్య‌లో నిలిచిపోయిన ఇళ్ల‌ను పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అద‌న‌పు స‌హాయాన్ని ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అద‌న‌పు ఆర్ధిక స‌హాయంతో జిల్లాలో 15,226 మంది ల‌బ్ధిదారుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరనుంది. 12,240 మంది బీసీలకు, 2,231 మంది ఎస్సీలకు ఒక్కో ఇంటికి రూ.50 వేలు, 565 మంది షెడ్యూల్డు తెగ‌ల వారికి రూ.75 వేలు, 190 మంది ఆదిమ‌ తెగ‌లకు రూ.లక్ష చొప్పున సహాయం అందనుంది.

News March 13, 2025

VZM: డీసీహెచ్ఎస్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి పరిధిలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని డీసీహెచ్ఎస్ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తులను జిల్లా సర్వజన ఆసుపత్రిలోని కార్యాలయానికి అందజేయాలన్నారు. పూర్తి వివరాలు https://www.ap.gov.in వెబ్‌సైట్‌‌లో కలవు.

error: Content is protected !!