News November 18, 2025

శంషాబాద్‌లో ర్యాగింగ్ కలకలం 2 వర్గాలుగా మారి గొడవ

image

శంషాబాద్‌లోని మీటా మైండ్ అకాడమీ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. 2nd ఇయర్ విద్యార్థులు 1st ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడటంతో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాల విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. హాస్టల్ విద్యార్థులపై డేస్కాలర్ విద్యార్థులు స్థానిక గ్యాంగ్‌ సహాయంతో దాడి చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 18, 2025

హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి: సీఎం

image

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత దేశమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. వికసిత్ భారత్ 2047 అనుగుణంగా అప్పటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా దేశాన్ని తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌ని కోరుతున్నామన్నారు.

హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా..!

image

హైదరాబాద్‌ జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మారెడ్‌పల్లి మండలంలో అత్యల్ప ఉష్ణోగ్రత 13.1℃గా నమోదైంది. అటు హిమాయత్‌నగర్, ముషీరాబాద్, నాంపల్లి, చార్మినార్, బండ్లగూడ, బహదర్‌పురా, అసిఫ్‌నగర్ 13.9, గోల్కొండ 14.6, తిరుమలగిరి 15.2, ఖైరతాబాద్ 15.3, షేక్‌పేట్ 16.1, సికింద్రాబాద్ మండలంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 16.2℃గా నమోదైంది.