News January 16, 2026

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం

image

శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ విమాన టికెట్ల ఉదంతం కలకలం రేపింది. ఖతర్ ఎయిర్ లైన్స్ విమానంలో దోహా వెళ్లేందుకు సిద్ధమైన 8 మంది ప్రయాణికుల టికెట్లు నకిలీవని తేలాయి. ఈ నకిలీ టికెట్ల వెనుక ఏవరైనా ఏజెంట్ల హస్తం ఉందా? లేదా ట్రావెల్ ఏజెన్సీల మోసమా? అనే కోణంలో శంషాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Similar News

News January 25, 2026

రూట్ సరికొత్త రికార్డు

image

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(POTM)లు నెగ్గిన ఇంగ్లండ్ ప్లేయర్‌గా జో రూట్ నిలిచారు. ఇవాళ శ్రీలంకతో మ్యాచులో అవార్డు అందుకోవడంతో ఈ రికార్డు చేరుకున్నారు. రూట్ 27 POTMలు అందుకోగా పీటర్సన్(26), బట్లర్(24), బెయిర్ స్టో(22), స్టోక్స్(21) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా ఓవరాల్‌గా అత్యధిక POTMలు అందుకున్న జాబితాలో సచిన్(76), కోహ్లీ(71), జయసూర్య(58) ముందు వరుసలో ఉన్నారు.

News January 25, 2026

గ్రామస్థాయిలో జగన్ సైన్యం సిద్ధం చేస్తున్నాం: పూజిత

image

గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా గ్రామ స్థాయి నుంచి జగన్ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నామని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత అన్నారు. శనివారం నెల్లూరు గాంధీనగర్‌లో నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ సమావేశ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అధికారం లేకపోయినా వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజల సమస్యలపై పోరాడుతున్నారని కొనియాడారు.

News January 25, 2026

పరిశుభ్రత కోసం మేడారంలో 285 బ్లాక్‌లు

image

మేడారంలో పరిశుభ్రతను సమర్థవంతంగా నిర్వహించేందుకు జాతర ప్రాంతాన్ని మొత్తం 285 బ్లాక్లుగా విభజించి.. ప్రతి బ్లాక్ కు ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. వెంటవెంటనే చెత్తను తొలగించడంతో పాటు టాయిలెట్లు శుభ్రత మురుగు నీటి సమస్యలు తలెత్తకుండా తదితర అంశాలను ప్రతిరోజు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. భక్తుల రద్దీని బట్టి జాతర ప్రాంతంలో 5,700 టాయిలెట్లు ఏర్పాటు చేశారు.