News January 4, 2025
శంషాబాద్: కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు నమోదు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేస్తున్న ఇద్దరు కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు నమోదైంది. ప్రయాణికుడి నుంచి రూ.50 వేలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం సదరు అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేసి రూ. 4.76 లక్షల స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ అధికారులు వినయ్ కుమార్, ముఖేశ్ కుమార్‌గా గుర్తించారు.
Similar News
News January 5, 2025
HYDలో పరిగి కానిస్టేబుల్ సూసైడ్
HYDలో మరో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఆదివారం HYD అంబర్‌పేటలోని తన నివాసంలో భాను శంకర్ ఉరి వేసుకున్నాడు. అయితే, భానుశంకర్ వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గత వారం వ్యవధిలోనే ముగ్గురు పోలీసులు HYDలోనే సూసైడ్ చేసుకోవడం గమనార్హం. అయితే, భాను శంకర్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News January 5, 2025
HYD: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
మేడ్చల్ చెక్ పోస్టు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. TVS వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని అంబులెన్స్ సాయంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
News January 5, 2025
CMR కాలేజీ బాత్రూంలో వీడియో రికార్డింగ్.. ARREST
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీఎంఆర్ కళాశాల హాస్టల్ బాత్రూంలో వీడియోల చిత్రీకరణ కేసులో మేడ్చల్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కళాశాల నిర్వాహకులతో పాటు హాస్టల్ వార్డెన్లపై పోక్సో చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విద్యార్థినులు బాత్రూంలో స్నానం చేస్తుండగా చూసేందుకు ప్రయత్నించామని నందకిషోర్ (A1), గోవింద్ కుమార్(A2) ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.