News March 10, 2025
శంషాబాద్: విమానానికి తప్పిన ప్రమాదం

ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన సర్వీస్ ఈరోజు ఉదయం 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి శంషాబాద్ మీదుగా వైజాగ్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించడంతో పైలట్ సిద్ధమయ్యాడు. అప్పటికే రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న మరో విమానాన్ని గమనించి, అప్రమత్తమై గాల్లోకి లేపడంతో పెను ప్రమాదం తప్పింది.
Similar News
News March 10, 2025
రంగారెడ్డి జిల్లాలో పరీక్ష రాసింది ఎందరంటే?

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 185 సెంటర్లలో 71,726 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 70,271 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 1,455 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షలు పూర్తైన అనంతరం ఆన్సర్ పేపర్లను స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
News March 10, 2025
HYD: పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

HYDతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మార్చి నుంచి జూన్ వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మార్చి మొదటి వారంలో ఎండల తీవ్రత ఒక్కసారిగా 37.4 డిగ్రీలకు చేరింది. రాత్రి ఉష్ణోగ్రత 19.8 డిగ్రీలుగా నమోదు కాగా.. పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.
News March 10, 2025
REWIND: భాగ్యనగరం.. భగ్గుమంది

10 మార్చి 2011 యాదుందా? సరిగ్గా 14 ఏళ్ల క్రితం భాగ్యనగరమంతా బారికేడ్లు.. పట్నమంతా పారామిలిటరీ బలగాలు.. అడుగడుగునా అరెస్టులు. అయినా దరువేస్తూ తెలంగాణ దండు కదిలింది. ట్యాంక్ బండ్ మీద కవాతు చేసింది. మలిదశ TG ఉద్యమాన్ని మలుపు తిప్పింది. అదే మిలియన్ మార్చ్. నిరోధాలను ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆ రోజు తెలంగాణ కోసం వేసిన ప్రతీ అడుగూ ప్రత్యేక రాష్ట్ర సాధన కల నెరవేర్చుకునేందుకు సాకరమైంది.