News March 15, 2025

శక్తి యాప్ పట్ల అవగాహన కల్పించండి: ఎస్పీ

image

మహిళలు, అమ్మాయిల భద్రత కోసం ప్రభుత్వం రూపొందించి అమల్లోకి తీసుకొచ్చిన శక్తి యాప్ పట్ల జిల్లాలో విస్తృతంగా అవగాహన చేయాలని పోలీసు అధికారులు, శక్తి టీమ్స్‌కు ఎస్పీ జగదీశ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మహిళ తమ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని, ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందేలా చైతన్యం చేయాలన్నారు. మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు, ఇతర హింసాత్మక ఘటనలను నివారించవచ్చన్నారు.

Similar News

News March 14, 2025

అనంత: రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి దుర్మరణం

image

కుందుర్పి మండలం అపిలేపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందడంతో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 14, 2025

ముదిగుబ్బ: కూతురిని తీసుకొచ్చేందుకు వెళ్లి గుండెపోటుతో మృతి

image

విజయవాడలో ఇంటర్ చదువుతున్న కూతురిని పరీక్షల అనంతరం తీసుకువచ్చేందుకు వెళ్లిన ఓ తండ్రి గుండెపోటుతో అక్కడే మృతిచెందాడు. ముదిగుబ్బకు చెందిన శ్రీనివాసరెడ్డి కూతురు విజయవాడలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. గురువారం ఆఖరి పరీక్ష అనంతరం ఇంటికి తీసుకొచ్చేందుకు భార్యతో కలిసి వెళ్లాడు. కూతురిని పరీక్షకు పంపి వారు షాపింగ్ చేస్తుండగా ఛాతీలో నొప్పితో కుప్పకూలి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

News March 14, 2025

JNTUA: ఎంటెక్ ఫలితాల విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఎంటెక్ 1వ, 2వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R21) పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కె.మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.

error: Content is protected !!