News February 26, 2025

శతశాతం ఈ-పంట నమోదు చేయాలి: కలెక్టర్ 

image

జిల్లాలో శత శాతం ఈ-పంట నందు నమోదు చేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరు కార్యాలయ సమావేశం మందిరంలో వ్యవసాయశాఖకు సంబంధించి ఈ-పంట నమోదుపై మండలాల వారీగా మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 32వేల ఎకరాలకు సంబంధించి 84 శాతం నమోదు పూర్తయిందన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి శతశాతం పూర్తిచేయాలని సూచించారు.

Similar News

News November 6, 2025

SKLM: ఈ నెల 11న ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

image

శ్రీకాకుళం జిల్లాలోని సివిల్ సర్వీసెస్ ప్రభుత్వ ఉద్యోగుల (పురుషులు, మహిళలు) కోసం జిల్లా స్థాయి క్రీడా ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి మహేశ్ బాబు బుధవారం తెలిపారు. నవంబర్‌ 11న కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్‌ కాలేజీలో మొత్తం 19 క్రీడాంశాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేస్తారన్నారు.ఉద్యోగులు తమ డిపార్ట్‌మెంట్ గుర్తింపు కార్డుతో స్టేడియం వద్ద హాజరుకావాలన్నారు.

News November 6, 2025

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచిత వైద్యం: పొన్నం

image

TG: కేంద్రం ప్రవేశ పెట్టిన పథకంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి రూ.లక్షన్నర వరకు ఫ్రీ వైద్యం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు భద్రతా చర్యలపై ఓ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య అధికంగా ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యా సంస్థల్లో రోడ్ సేఫ్టీ, రూల్స్‌పై వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు.

News November 6, 2025

ఒంగోలులో తొలిసారి షూటింగ్ టోర్నమెంట్.!

image

ప్రకాశం జిల్లాకు అరుదైన అవకాశం దక్కింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి షూటింగ్ టోర్నమెంట్ ఒంగోలులో నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఈనెల 7, 8, 9న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో షూటింగ్ టోర్నమెంట్‌ నిర్వహించనున్నారు. 700మంది క్రీడాకారులు తరలి వస్తారని డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. టోర్నీ గురించి కలెక్టర్ రాజాబాబుతో డీఈఓ బుధవారం చర్చించారు.