News December 22, 2025

శత వసంతాల చర్చి.. మన తెనాలి టౌన్ చర్చి

image

తెనాలి బోస్ రోడ్డులోని చారిత్రక క్రైస్ట్ లూథరన్ చర్చి 100ఏళ్ల మైలురాయిని అధిగమించింది. 1925లో ప్రారంభమైన ఈ చర్చికి ఒక విశిష్ట చరిత్ర ఉంది. అప్పట్లో సింగపూర్ నుంచి ప్రత్యేక శిలలను, అత్యంత నాణ్యమైన టేకు కలపను తెప్పించి దీనిని అపురూపంగా నిర్మించారు. ఇక్కడ కొలువైన సంస్కర్త మార్టిన్ లూథర్ విగ్రహం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఇటీవలే ఈ చర్చి శతాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు.

Similar News

News December 23, 2025

పల్నాడులో ముమ్మరంగా వరి కోతలు

image

పల్నాడు జిల్లాలో సాగర్ కుడి కాలువ ఆయకట్టు పరిధిలో సాగుచేస్తున్న వరి పంట కోతకు రావటంతో రైతులు వరి కోత యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. వరి కోతకు పంట నూర్పిడికి ఎకరాకు రూ.10 వేలు ఖర్చు అవుతుండగా కూలీలు దొరకడం లేదు. చేసేది లేక రైతులు గంటకు రూ. 2 నుంచి రూ.2,500 వరకు వెచ్చించి యంత్రాల సహాయంతో వరి కోతలు కోయిస్తున్నారు. యంత్రాల సహాయంతో సమయం కూడా అదా అవుతోందని రైతులు అంటున్నారు.

News December 23, 2025

‘మీ డబ్బు-మీ హక్కు’ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల రికవరీ కోసం RBI ఆదేశాల మేరకు చేపట్టిన ‘మీ డబ్బు-మీ హక్కు’ కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 1,65,053 ఖాతాల్లో దాదాపు రూ. 21.32 కోట్ల మేర నగదు క్లెయిమ్ కాకుండా నిలిచిపోయిందని వెల్లడించారు.

News December 23, 2025

90% సొంత టెక్నాలజీ అట.. పాక్ పిట్టకథలు!

image

ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం ధాటికి వణికిపోయిన పాక్.. ఇప్పుడు అబద్ధాలతో కవర్ చేస్తోంది. 90% సొంత టెక్నాలజీతో భారత యుద్ధ విమానాలను కూల్చామంటూ ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్ జోకులేస్తున్నారు. నిజానికి మన దెబ్బకు పాక్ దగ్గరున్న చైనా ఆయుధాలు ఏమాత్రం పనిచేయలేదని ఆధారాలతో సహా ప్రపంచానికి చూపించాం. పరువు కాపాడుకోవడానికి, తుప్పు పట్టిన ఆయుధాలను అమ్ముకోవడానికి మునీర్ ఇప్పుడు పిట్టకథలు చెప్పడం ఎంత విడ్డూరమో!