News January 31, 2025
శనివారం HYDలో కృష్ణా జలాలు బంద్

HYDలో ఫిబ్రవరి ఒకటో తేదీన కృష్ణా జలాలు బంద్ కానున్నాయి. నల్లగొండ జిల్లాలోని నాసర్లపల్లి సబ్‌స్టేషన్‌లోని 132 KV బల్క్ లోడ్ ఫీడర్ పీటీఆర్ మరమ్మతులకు గురైంది. దీంతో నాగార్జున్‌సాగర్‌లోని కోదండాపూర్‌లోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. దీనికి TG ట్రాన్స్‌కో అధికారులు శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గం. వరకు మరమ్మతులు చేయనున్నారు.
Similar News
News September 14, 2025
GHMC వెథర్ రిపోర్ట్ @ 10AM

జీహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు ఆకాశం సాధారణంగా మేఘావృతంగా ఉండి.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గంటకు 30- 40KM వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 29°C, కనిష్ఠం 23°C ఉండే అవకాశం ఉందని తెలిపింది. కాగా నిన్న నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్ఠం 29.0°C, కనిష్ఠం 22.2°Cగా నమోదైంది.
News September 14, 2025
GDPలో MSMEలు 10% వాటా సాధించాలి: మంత్రి

రాష్ట్ర GDPలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) వాటా 10% ఉండేలా తమ ప్రభుత్వం నూతన పాలసీని రూపొందించినట్టు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. శనివారం గో-నేషనల్- ఎక్స్ పో(GoNat) 2025 5వ ద్వైవార్షిక సదస్సును ప్రారంభించారు. నిర్వాహకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. తక్కువ వడ్డీతో రుణ సదుపాయం, నిధుల సమీకరణకు అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తున్నట్టు తెలిపారు.
News September 14, 2025
ఉస్మానియా యూనివర్సిటీ బీసీఏ పరీక్షా తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీసీఏ (సీబీసీఎస్) ఆరో సెమిస్టర్ మేకప్ పరీక్షలను ఈ నెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.