News October 26, 2024

శని, ఆదివారాల్లో సింహపురి ఎక్స్ ప్రెస్ రైలు రద్దు

image

దానా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సింహపురి ఎక్స్ ప్రెస్ రైలు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. శనివారం సికింద్రబాద్ నుంచి వచ్చే(12710) రైలు రద్దు చేయగా, ఆదివారం గూడూరు నుంచి సికింద్రబాద్ వెళ్లే(12709) రైలు కూడా రద్దయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలన్నారు.

Similar News

News February 18, 2026

అలిపిరిలో పురాతన మండపం తొలగింపు

image

చాలామంది కాలినడకన తిరుమలకు వెళ్తారు. అలిపిరి వద్ద తొలి మెట్టు ఎక్కగానే కుడి వైపున పురాతన పాదాల మండపం ఉండేది. ఇకపై మీకు అది కనిపించదు. దీనిని పూర్తిగా తొలగించారు. పుణేకు చెందిన లార్డ్ వేంకటేశ్వర ఛారిటబుల్ అండ్ రిలీజియస్స్ ట్రస్ట్ నేతృత్వంలో ఆర్కియాలజీ అధికారులు పర్యవేక్షణలో మండలంలోని దూలాలు, స్తంభాలను జాగ్రత్తగా తొలగించి భద్రపరిచారు. తొలగించక ముందు, ఆ తర్వాత ఎలా ఉందో పై ఫొటోలో చూడవచ్చు.

News February 18, 2026

నెల్లూరు: రిజిస్ట్రార్ బాలాంజనేయులు బదిలీ..!

image

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసఫ్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈయన అల్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన బాధ్యతలు తీసుకునే వరకు ప్రకాశం జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఇక్కడ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో రవి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

News February 18, 2026

నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు బదిలీ..!

image

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసఫ్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈయన అల్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. అప్పటి వరకు ఇక్కడ ప్రకాశం జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఇన్‌ఛార్జ్‌గా కొనసాగనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో రవి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.