News January 13, 2026

శని త్రయోదశి ప్రత్యేక పూజ

image

శని త్రయోదశి శని దేవుని అనుగ్రహం పొందేందుకు అత్యంత విశిష్టమైన రోజు. ఏల్నాటి శని, అష్టమ శని ప్రభావంతో పనుల్లో ఆటంకాలు, కష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఈ పూజ అమోఘమైన పరిష్కారం. శాస్త్రోక్తంగా నిర్వహించే ఈ ఆరాధనతో శని దోషాలు తొలగి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పవిత్ర పర్వదినాన మీ పేరు, గోత్రంతో వేదమందిర్‌లో పూజ నిర్వహించుకుని శని దేవుని కృపకు పాత్రులు అవ్వండి. మీ పూజను ఇప్పుడే <>నమోదు చేసుకోండి<<>>.

Similar News

News February 21, 2026

HYD: TG EAPCET పరీక్షకు 20వేల దరఖాస్తులు

image

TG EAPCET ప్రవేశ పరీక్షకి ఈ రోజు ఇంజినీరింగ్ విభాగానికి 12,770 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి 7,354 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2 విభాగాలకు సంబంధించి 19 మంది దరఖాస్తు చేసుకున్నారని కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు వరకు 20,143 దరఖాస్తుకు వచ్చాయని కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

News February 21, 2026

ట్రంప్ టారిఫ్‌ల రద్దు.. భారత్ రియాక్షన్ ఇదే

image

ట్రంప్ విధించిన టారిఫ్‌లను US సుప్రీంకోర్టు రద్దు చేయగా ట్రంప్ తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో తొలిసారి భారత వాణిజ్య శాఖ రియాక్టైంది. US SC ఇచ్చిన తీర్పును పరిశీలిస్తున్నామని చెప్పింది. ఆపై ట్రంప్ వ్యాఖ్యలు, ఆ దేశ యంత్రాంగం ప్రకటించిన కొన్ని చర్యల వల్ల భవిష్యత్తులో ఏ మేరకు ప్రభావం ఉంటుందనే దానిపై పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. ట్రంప్ ప్రపంచ దేశాలపై మళ్లీ 10% టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే.

News February 21, 2026

రోటీ చెయ్యడానికి ఓ బాక్సు

image

చపాతీ, పూరీలు ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఎంతో ఇష్టంగా తింటారు. వాటిని చేయడం ఒక పని అయితే, ఆ తర్వాత వంటగది గట్టు శుభ్రపరచడం మరో పెద్ద పని. అలాకాకుండా ఉండాలంటే ఈ రోటీ బాక్సును ట్రై చేయండి. దీంతో ఈజీగా చపాతీలు చేసుకోవచ్చు. కదలకుండా ఉండేందుకు నాన్‌స్లిప్‌ ప్యాడ్లు ఉంటాయి. చూడడానికి సూట్‌కేసులా ఉండే ఈ బాక్సును కిచెన్‌లో ఎక్కడైనా సర్దేయొచ్చు. ఇవి అన్ని ఆన్‌లైన్ సైట్లలోనూ అందుబాటులో ఉన్నాయి.