News January 24, 2026
శబరిమలలో మూవీ షూటింగ్? విచారణకు ఆదేశం!

అయ్యప్ప సన్నిధానంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా షూటింగ్ జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మలయాళ డైరెక్టర్ అనురాజ్ మనోహర్ నిషేధిత ప్రాంతంలో వీడియోగ్రఫీ చేశారన్న ఫిర్యాదుపై ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డ్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. షూటింగ్‌కు అనుమతి అడిగినా బోర్డు నిరాకరించిందని అధికారులు స్పష్టం చేశారు. అయితే తాము పంబలో మాత్రమే వీడియో తీశామని మనోహర్ తెలిపారు.
Similar News
News February 15, 2026
హ్యాండ్ షేక్ ఇచ్చుకుంటారా? కెప్టెన్లు ఏమన్నారంటే?

T20WCలో భాగంగా భారత్, పాక్ జట్లు ఈరోజు తలపడనున్నాయి. కాగా పహల్గామ్ ఘటన తర్వాత భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్ షేక్ ఇవ్వడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు మ్యాచ్‌లో హ్యాండ్ షేక్ ఇచ్చుకుంటారా? అనే ప్రశ్నలకు ఇరు జట్ల కెప్టెన్లు నిన్న స్పందించారు. ‘ఇంకా టైముంది కదా.. టాస్ వేసే సమయానికి చూడండి’ అని సూర్య అన్నారు. అటు పాక్ కెప్టెన్ అఘా ‘దాని గురించి రేపు చూద్దాం’ అన్నారు.
News February 15, 2026
రైతుభరోసా ఒకే విడతలో.. ?

TG: గతంలో మాదిరి కాకుండా ఈసారి ప్రభుత్వం ఒకే విడతలో రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎకరాల చొప్పున డబ్బులు విడుదల చేయడంతో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి 9 రోజుల సమయం పట్టేది. ఈసారి పెట్టుబడికి రైతులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఒకే విడతలో ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 17న రైతుభరోసా నిధులు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
News February 15, 2026
పాకిస్థాన్‌కు ‘ధురంధర్’ డోస్!

T20 WCలో ఇవాళ కొలంబో వేదికగా జరగనున్న IND, PAK మ్యాచుకు ముందు మ్యూజికల్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారని జాతీయ క్రీడా వర్గాలు తెలిపాయి. ఇందులో ‘ధురంధర్’ సినిమా పాటల్ని ప్లే చేస్తారని, ర్యాపర్ హనుమాన్‌కైండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారని పేర్కొన్నాయి. పాక్, గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాపై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. కానీ ఈరోజు ఆ టీమ్‌తో పాటు PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీకి ‘ధురంధర్’ డోస్ తప్పేలా లేదు.


