News November 21, 2025
శబరిమలై యాత్రికుల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి: డీటీవో

శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డ్రైవర్లు మెళకువలు పాటిస్తూ వాహనాలు నడపాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సూచించారు. శబరిమలై యాత్రికులతో ఆర్టీసీ, ట్రావెల్స్ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు జిల్లా నుంచి తరలి వెళ్తున్నందున డ్రైవర్లు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. మంచు కురిసే సమయాల్లో డ్రైవింగ్ చేయవద్దని, సుదూర ప్రయాణాల్లో తప్పనిసరిగా వాహనంలో ఇద్దరు డ్రైవర్లు ఉండాలని ఆయన ఆదేశించారు.
Similar News
News November 21, 2025
విశాఖ: ప్రేమ.. పెళ్లి.. ఓ తమిళబ్బాయ్..!

విశాఖలో ఒక అమ్మాయి కోసం ఇద్దరు యువకుల ఘర్షణ పడగా ఒకరికి గాయాలయ్యాయి. ఓ హోటల్లో పనిచేస్తున్న అమ్మాయి మొదట ఒక తెలుగు యువకుడ్ని ప్రేమించింది. తర్వాత మరో తమిళ యువకుడిని పెళ్లి చేసుకోవడానికి రెఢీ అయ్యింది. దీంతో ఆ ఇద్దరి యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తెలుగు యువకుడు, తమిళ యువకుడుపై కత్తితో దాడి చేసినట్లు అమ్మాయి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో త్రీటౌన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
News November 21, 2025
‘హిడ్మాను, మరికొందరిని పట్టుకొని ఎన్కౌంటర్ కథ అల్లారు’

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మా కామ్రేడ్ రాజేతో పాటు కొంతమందిని విజయవాడలో ఈనెల 15న నిరాయుధంగా ఉన్న సమయంలో పట్టుకుని క్రూరంగా హత్య చేసి మారెడుమిల్లి ఎన్కౌంటర్ కట్టుకథను అల్లారని, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు . AOB రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్‌ను చంపారని అందులో పేర్కొన్నారు.
News November 21, 2025
DoPTకి లేఖ రాసిన ACB

ఫార్ములా eరేస్ కేసు దర్యాప్తులో ACB స్పీడ్ పెంచింది. కేసులో A2గా ఉన్న సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి DoPT (డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) అనుమతి కోరింది. కేంద్ర సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అరవింద్‌ను విచారించి ఆయనపై చార్జిషీట్ దాఖలు చేయనుంది. IASలను విచారించాలంటే DoPT పర్మిషన్ ఉండాలి. అటు A1 KTRను విచారించేందుకు గవర్నర్ ఇప్పటికే అనుమతించడం తెలిసిందే.


