News November 18, 2025

శబరిమల భక్తులకు అలర్ట్

image

శబరిమల యాత్రికులు పంబా నదిలో స్నానం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. ముక్కు ద్వారా నీరు లోపలికి వెళ్తే ప్రమాదకర అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌ (బ్రెయిన్ ఫీవర్) వ్యాధి సోకే ప్రమాదం ఉందని తెలిపారు. వ్యాధి ప్రారంభంలో తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడ బిగుసుకుపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. నదిలో మునిగేటప్పుడు ముక్కు మూసుకోవాలని సూచించారు.

Similar News

News November 18, 2025

హిడ్మాకు బహుభాషల్లో పట్టు

image

మడావి హిడ్మా మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్త. తెలంగాణ కమిటీ, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(PLGA)కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్‌ అనే పేర్లు ఉన్నాయి. మురియా తెగకు చెందిన ఆయనకు హిందీ, గోండు, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో పట్టుంది. కొద్దిరోజులుగా అతడు లొంగిపోతాడనే ప్రచారం జరిగినా ఈ ఉదయం అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

YCP అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి అరెస్టు

image

AP: YCP అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డిని HYDలోని తన ఇంట్లో ఈ ఉదయం ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిపై రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. కాగా పరకామణి కేసులో కీలకంగా ఉన్న సతీశ్ మృతిపై వెంకట్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని అనంతపురం టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.