News December 28, 2025
శబరిమల మకరజ్యోతి దర్శనం ఎప్పుడు?

అయ్యప్ప స్వామి భక్తులు ఎంతగానో ఎదురుచూసే శబరిమల మకరజ్యోతి 2026లో జనవరి 14న కనిపించనుంది. ఆ రోజు సాయంత్రం 6:30 నుంచి 6:55 గంటల మధ్య పొన్నాంబలమేడు వద్ద దర్శనమిస్తుందని అంచనా. జ్యోతి దర్శనార్థం వచ్చే భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని దేవస్వం బోర్డు సూచించింది. జనవరి 19 రాత్రి వరకు దర్శనానికి అవకాశం ఉండగా 20వ తేదీన ఆలయం మూసివేయనున్నారు.
Similar News
News February 15, 2026
భక్తురాలి అమాయకత్వానికి లొంగిపోయిన ఈశ్వరుడు

శివభక్తురాలైన గొడగూచిని తన తండ్రి ఊరెళ్తూ శివలింగానికి పాలు నైవేద్యంగా సమర్పించమని చెబుతాడు. గొడగూచి అమాయకమైన భక్తితో శివుడిని పాలు తాగమని వేడుకొంది. శివుడు పాలు తాగలేదు. దీంతో తనేమైనా తప్పు చేశానేమో అని బాధపడింది. ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఆమె నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆమె చేతి పాలు తాగాడు. అలిగి, అల్లరి చేసిన ఆ చిన్నారి భక్తురాలిని తనలో లీనం చేసుకున్నాడు.
News February 15, 2026
100 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల

ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(AFMS) షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 100 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. MBBS, పీజీ అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు MBBS అర్హత గలవారికి 30ఏళ్లు, పీజీ అర్హత గలవారికి 35ఏళ్లు. ఫిజికల్ ఫిట్‌నెస్ కలిగి ఉండాలి. వెబ్‌సైట్: www.join.afms.gov.in
News February 15, 2026
RAC గురించి తెలుసా?

RAC అంటే Reservation Against Cancellation అని అర్థం. ఈ టికెట్ ఉంటే మీరు రైల్లో ప్రయాణం చేయడానికి అర్హులే. కానీ ఫుల్ స్లీపర్ బెర్త్ కేటాయించరు. సైడ్ లోయర్ బెర్త్‌ను మరో ప్రయాణికుడితో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. చార్ట్ ప్రిపరేషన్ కంటే ముందే ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే మీ RAC టికెట్ కన్ఫామ్ అవుతుంది. అప్పుడు ఆ ఫుల్ బెర్త్ మీకే వస్తుందన్న మాట. ఉదాహరణకు RAC/84 అంటే మీ RAC క్యూలో ఉందని అర్థం.


