News June 24, 2024

శభాష్ నితీష్ కుమార్ రెడ్డి..!

image

విశాఖ బ్యాటింగ్ డైనమెట్, SRH ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇండియా టీ-20 టీంకు ఎంపికైన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించారు. క్రికెట్ చరిత్రలో విశాఖ పేరును ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేస్తున్న సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నితీష్‌ను పలువురు అభినందిస్తున్నారు. ఆయన ఎంపిక పట్ల ACA గౌరవఅధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News January 15, 2025

గాజువాకలో దారుణం.. చిన్నారి మృతి

image

గాజువాకలోని పండగ వేల ఒక అపార్ట్మెంట్ వద్ద సెల్లార్‌లో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని కారు ఢీకొంది. తీవ్రగాయాలతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సుజాతనగర్ ప్రాంతానికి చెందిన భోగిర్ల లారీణి తన తల్లిదండ్రులతో సెల్స్ట్ అపార్ట్మెంట్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. చిన్నారి ఆడుకుంటుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. గాజువాక పోలీసులు కారు డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. పండగ వేళ ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

News January 14, 2025

మధురవాడ: రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

మధురవాడ జాతీయ రహదారిపై ఆనందపురం వెళుతున్న ఓ బైక్‌పై లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో కారు ఢీకొనడంతో వెనుక కూర్చున్న మహిళ కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పీఎం పాలెం ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కార్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పీఎం పాలెం ట్రాఫిక్ సీఐ సునీల్ దర్యాప్తు చేపట్టారు.

News January 14, 2025

విశాఖ నుంచి 300 బస్సులను నడిపిన ఆర్టీసీ

image

సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం సోమవారం 300 స్పెషల్ బస్సులను నడిపినట్లు ఆర్టీసీ విశాఖ ప్రాంతీయ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, టెక్కలి, పలాస రూట్లలో ప్రయాణికులను ఎప్పటికప్పుడు బస్సుల్లో పంపించినట్లు పేర్కొన్నారు. ద్వారక ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్‌లో దుకాణాలను తనిఖీ చేసి, ఎంఆర్పీ రేట్లకే వస్తువులను విక్రయించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు.