News February 25, 2026
శర్వానంద్ మాస్ లుక్

శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘భోగి’ నుంచి ఆయన లుక్ విడుదలైంది. అందులో శర్వా మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా చేతిలో ఆయుధంతో దర్శనమిచ్చారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 28న విడుదల కాబోతోంది.
Similar News
News February 25, 2026
పసుపు పంటలో దుంప తొలుచు ఈగ – నివారణ

పసుపు పంట సుడి దగ్గర ఆకులు వాడి, ఎండిపోయి, లాగినప్పుడు మొవ్వు సులభంగా ఊడొచ్చి, దుంప లోపల బియ్యం గింజల్లాంటి పిల్ల పురుగులు కనిపిస్తే అది దుంప తొలుచు ఈగగా గుర్తించాలి. దీని నివారణకు ఎకరాకు 100 కిలోల వేపపిండిని మొక్కల మధ్య వేయాలి. సెంటుకు 100 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలకు అదే పరిమాణం గల ఇసుకతో కలిపి పొలంలో తెగులు ఆశించిన దగ్గర చల్లాలి. అలాగే మొక్కల మధ్య నీరు నిల్వకుండా జాగ్రత్త వహించాలి.
News February 25, 2026
2,551నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

న్యూఢిల్లీలోని <
News February 25, 2026
ఎందుకలా?!: ఇవి జీవితంలో నీళ్లే తాగవు..

‘కంగారూ ఎలుకలు’ తమ జీవిత కాలం(2-5yrs)లో ఒక్కసారి కూడా నీళ్లు తాగవు. వీటి ఆహారమైన గింజలు, విత్తనాల్లోని తేమతో దాహం తీర్చుకుంటాయి. ఆహారం జీర్ణమయ్యే టైమ్‌లో శరీరంలో ‘మెటబాలిక్ వాటర్’ను తయారు చేసుకుంటాయి. ఒంటెలు, కోలాలు, కొన్ని రకాల కప్పలు నీళ్లు లేకుండా కొన్ని రోజులు/నెలలు బతకగలవు. మనుషులు నీరు తాగకుండా 3-4 రోజులు ఉండగలరని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతిరోజూ 4pmకు ఇలా ఓ కొత్త విషయం ఎందుకలా?!లో.


