News October 6, 2025
శాంతించిన వంశధార..!

ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వంశధారకు వరద పోటెత్తింది. ఒకానొక సమయంలో లక్ష క్యూసెక్యలకు పైగా నీరు నదిలో ప్రవహించింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నది శాంతించింది. సోమవారం ఉదయం 6 గంటలకు వంశధారలో 29,224 క్యూసెక్కులకు నీటి ప్రవాహం తగ్గింది. గొట్టా బ్యారేజీ 22 గేట్లను కాస్త లిఫ్ చేసి దిగువ ప్రాంతానికి నీరు విడిచి పెడుతున్నట్లు వంశధార డీఈ సరస్వతి వెల్లడించారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో ప్రవాహం లేదు.
Similar News
News April 1, 2026
అసిరితల్లి సిరిమానోత్సవాలు.. మంత్రికి ఆహ్వానం

కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం గ్రామంలో ఏప్రిల్ 20 నుంచి 28 వరకు గ్రామదేవత అసిరితల్లి సిరిమానోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామ పెద్దలు, కార్యనిర్వహణ కమిటీ సభ్యులు మంత్రి అచ్చెన్నాయుడును సిరిమానోత్సవాలకు ఆహ్వానించారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో మంత్రి మంగళవారం ఆవిష్కరించారు.

News March 31, 2026
టెక్కలి: ఆ ఉద్యోగాల ధరఖాస్తుకు నేడే ఆఖరి

టెక్కలి రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఉన్న సబ్ కలెక్టర్ ఫిల్లింగ్ స్టేషన్‌లో మేనేజర్-(2), పంపు ఆపరేటర్-(6) ఔట్ సోర్సింగ్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి రోజు అని టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత, పోలీస్ నో అబ్జెక్షన్, అనుభవ ధ్రువీకరణ పత్రాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం 11 గం.లకు ఇంటర్వ్యూలో పాల్గొనాలన్నారు.