News August 26, 2025
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ జానకి షర్మిల

బుధవారం నుంచి ప్రారంభం కానున్న వినాయక నవరాత్రులకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని SP జానకి షర్మిల అధికారులను ఆదేశించారు. పండుగ ప్రారంభం నుంచి నిమజ్జన శోభాయాత్ర వరకు ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు
Similar News
News August 27, 2025
చందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్పీ ఆకస్మిక తనిఖీ

చందుర్తి మండల పోలీస్ స్టేషన్‌ను వేములవాడ సబ్ డివిజన్ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. రాబోయే వినాయక నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో పూర్తి చేయాలని, అలాగే విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఆదేశించారు.
News August 27, 2025
RGM: TBGKS కేంద్ర కోశాధికారిగా చెల్పూరి సతీశ్

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) కేంద్ర కోశాధికారిగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన చెల్పూర్ సతీశ్‌ను నియమిస్తున్నట్లు యూనియన్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా BRS పార్టీలో పనిచేస్తూ విద్యార్థి నాయకుడిగా, యూనియన్‌లో క్రియాశీలకంగా పనిచేసిన సతీశ్‌ను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
News August 27, 2025
పెద్దపల్లి: క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి చర్యలు: దీపక్ జాన్

తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ మంగళవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో పాస్టర్లతో సమావేశం నిర్వహించి, చర్చి నిర్మాణ అనుమతులు, బరియల్ గ్రౌండ్స్, కుల ధ్రువపత్రాలు, క్రిస్టియన్ భవన్ ఏర్పాటుకు సంబంధించిన వినతులను పరిశీలించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణుతోపాటు సంబంధిత అధికారులను ఆదేశించారు.