News March 1, 2026

‘శాంతి కలుగుగాక’.. ఖమేనీ X అకౌంట్ నుంచి పోస్ట్!

image

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ చనిపోయినట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన X అకౌంట్స్‌లో ఒకదానిలో పోస్ట్ చర్చనీయాంశమైంది. ‘అతనికి శాంతి కలుగుగాక’ అని అర్థం వచ్చే పర్షియన్‌ టెక్ట్స్‌తో పాటు ఓ యోధుడు ఖడ్గం పట్టిన ఇమేజ్ పోస్ట్ చేశారు. దీంతో ఇది ఖమేనీ మరణ వార్తను ఉద్దేశించి చేసిందేనని.. పరోక్షంగా కన్ఫామ్ చేసినట్టేనేనంటూ వార్తలు జోరందుకున్నాయి. అయితే ఇరాన్ ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Similar News

News March 1, 2026

నాడు కత్తుల పోరు.. నేడు క్షిపణుల హోరు

image

పూర్వం రాజ్యాల కోసం రాజులు దండెత్తి, అమాయకులను బలితీసుకున్నారనే గాథలు విన్నాం. నేడు ఆధునిక ప్రపంచంలోనూ అదే క్రూరత్వం కనిపిస్తోంది. ఒకరిని అంతం చేసేందుకు దేశాలు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ భీకర దాడుల్లో పసిపిల్లలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అభివృద్ధి చెందిన దేశాలు సైతం పాతకాలపు క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ అమాయకుల రక్తంతో యుద్ధ క్షేత్రాన్ని తడపడం మానవత్వానికే తీరని మచ్చ.

News March 1, 2026

కలుపు మందుల వల్ల భూమికి కలిగే నష్టం

image

వ్యవసాయంలో కలుపు మొక్కల నివారణకు రసాయనాలతో కూడిన కలుపు మందుల వాడకం విపరీతంగా పెరిగింది. అనాలోచితంగా పంట భూములకు వీటిని వాడటం వల్ల కలుపుతో పాటు భూమిలో పంటకు మేలు చేసే జీవరాశి కూడా అంతమై, పంట పొలాలు నిర్జీవమయ్యే ప్రమాదం ఉంది. నేలలో జరిగే చర్యలు ఆగిపోయి మొక్కలకు పోషకాలు అందవు. సాగు, తాగు నీటి వనరులు, నేల నిర్మాణం పాడైపోయే ముప్పు ఉంది. అందుకే వీటిని తప్పనిసరిగా నిపుణుల సూచనలతో అవసరమైతేనే వాడాలి.

News March 1, 2026

608 అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (<>HPCL)<<>>లో 608 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. APలో 62, TGలో 22 పోస్టులు ఉన్నాయి. ఇంజినీరింగ్(సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్)అర్హత గలవారు NATS 2.0 పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18-25ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.25,000 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.hindustanpetroleum.com