News February 28, 2025
శాంతి కుమారి కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ త్రిపాఠి

నల్గొండ జిల్లాలో ఇంటర్ పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారికి తెలిపారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు.
Similar News
News March 1, 2025
సైబర్ మోసగాళ్లతో జాగ్రత్త: ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుతాం అంటూ కాల్ చేసే సైబర్ మోసగాళ్లతో జాగ్రత్త అని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్ ద్వారా లేదా SMS వస్తున్నట్లయితే, అది సైబర్ మోసగాళ్ళ పని అయ్యి ఉంటుందని పేర్కొన్నారు. క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచే ఆఫర్‌తో సైబర్ మోసగాళ్ళు బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి మిమ్మలను నమ్మించి మోసం చేస్తారని అన్నారు.
News March 1, 2025
నేడు నల్గొండకు రానున్న జాన్‌వేస్లీ

CPM రాష్ట్రకార్యదర్శి కామ్రేడ్ జాన్‌వేస్లీ నేడు నల్గొండకు రానున్నారు. జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ అనంతరం స్థానిక కోమటిరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో సమావేశం నిర్వహించి CPM జాతీయ మహాసభల ముసాయిదా తీర్మానం, రాజకీయ తీర్మానాలపై చర్చ నిర్వహించనున్నట్లు CPM జిల్లా కార్యదర్శి వీరారెడ్డి తెలిపారు. జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు, శాఖ కార్యదర్శులు, ఇతర CPM కమిటీ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొంటారన్నారు.
News February 28, 2025
కనగల్: వాగులో పడి బాలుడి దుర్మరణం

కనగల్ మండలం జీ యడవల్లి గ్రామ వాగులో పడి ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. ఏఎస్ఐ కే. నర్సింహా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పర్సనబోయిన బోపాల్- అరుణ దంపతుల చిన్న కుమారుడు చరణ్ తేజ్ (6) గురువారం సెలవు దినం కావడంతో పొలం వద్ద ఉన్న తండ్రి దగ్గరకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వాగు నీటి గుంతలో పడి మరణించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.