News January 18, 2026

‘శాంతి బోర్డు’లోకి ఇండియాను ఆహ్వానించిన ట్రంప్!

image

గాజా శాంతి బోర్డులో చేరాలంటూ ఇండియాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించారు. గాజాలో పాలన, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ పీస్‌ను ఈ నెల 15న ఏర్పాటు చేశారు. దీనికి ట్రంప్ ఛైర్మన్‌గా ఉంటారని వైట్ హౌస్ ప్రకటించింది. 11 మంది సభ్యులతో ప్రత్యేకంగా గాజా కార్యనిర్వాహక బోర్డు ఉంటుందని తెలిపింది. మరోవైపు తమకూ ట్రంప్ నుంచి పీస్ బోర్డులోకి ఆహ్వానం అందిందని పాకిస్థాన్‌ వెల్లడించింది.

Similar News

News February 12, 2026

ఓపిక తగ్గిపోతోందా?

image

వాతావరణ మార్పులు, వేళకి తినకపోవడం, ఇంటా బయటా పనంటూ ఉరుకులు పరుగుల వల్ల చాలామంది మహిళలు తరచూ నీరసపడిపోతూ ఉంటారు. తగినంత విశ్రాంతి లేకపోతే శరీరం మాత్రం కోలుకోదు. కాబట్టి విశ్రాంతి తప్పనిసరి. రోజూ మీ ఆహారంలో పప్పుధాన్యాలు, గింజలను తప్పనిసరి చేసుకోండి. తేలికపాటి వ్యాయామాల్నీ దినచర్యలో తప్పక భాగం చేసుకోవాలి. పనంతా పూర్తయ్యాక తప్పదు కాబట్టి నిద్ర అన్నట్లుగా కాక ఒక సమయాన్ని నిర్దేశించుకోండి.

News February 12, 2026

IPLలో అన్‌సోల్డ్.. PSLలో ఖరీదైన ప్లేయర్

image

IPL వేలంలో అన్‌సోల్డ్‌గా మిలిగిన స్టీవ్ స్మిత్‌కు PSLలో రికార్డు స్థాయి ధర లభించింది. లీగ్ హిస్టరీలోనే అత్యధికంగా PKR 14 కోట్ల(₹4.54Cr)కు ఆయనను సియాల్‌కోట్ స్టాలియన్స్ సొంతం చేసుకుంది. బౌలర్ నసీమ్‌ను PKR 8.65 కోట్లకు, అష్రఫ్‌ను PKR 8.5 కోట్లకు ఇస్లామాబాద్ కొనుగోలు చేసింది. పాక్ స్టార్ ప్లేయర్ బాబర్‌కు పెషావర్ టీమ్ PKR 7 కోట్లే వెచ్చించడం గమనార్హం. మార్చి 26 నుంచి మే 3 వరకు 8 జట్లతో PSL జరగనుంది.

News February 12, 2026

అందుకే BRS అధికారం కోల్పోయింది: కవిత

image

TG: ప్రజాస్వామ్య విలువలను కాలరాయడం వల్లే BRS అధికారం కోల్పోయిందని కవిత అన్నారు. ‘ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చనందుకే KCR అధికారం కోల్పోయారు. రేవంత్‌ పట్టించుకోకపోతే ఆయననూ ప్రజలు వదిలిపెట్టరు’ అని హెచ్చరించారు. రాజకీయ పార్టీ పెడతానంటే తనపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ పదం ఉండేలా పార్టీ పెడతానని ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో వ్యాఖ్యానించారు.