News April 18, 2025

శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: డీసీపీ

image

శాంతిభద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సూచించారు. నర్సంపేటలోని బస్టాండ్ ఆవరణలో స్పెషల్ ట్రైన్డ్ నార్కో అనాలసిస్ డాగ్ స్క్వాడ్ సహకారంతో శుక్రవారం తనిఖీలు చేపట్టారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల రవాణా నియంత్రణకు ఈ తనిఖీలు చేపట్టినట్లు డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. ఏసీపి కిరణ్ కుమార్, సిఐ రమణమూర్తి, ఎస్సైలు రవికుమార్, అరుణ్ తదితరులు ఉన్నారు.

Similar News

News April 19, 2025

చెరకు రసాన్ని నిల్వ ఉంచి తాగుతున్నారా?

image

వేసవిలో ఉపశమనం పొందేందుకు చాలా మంది చెరకు రసం తాగుతుంటారు. అయితే కొందరు చెరకు రసాన్ని నిల్వచేసి కొన్ని గంటల తర్వాత
సేవిస్తుంటారు. అలా చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గది ఉష్ణోగ్రత వద్ద స్వచ్ఛమైన చెరకు రసం ఆక్సీకరణం చెందడం 15minలో మొదలవుతుంది. ఈ రసాయనిక చర్యతో 45 ని.ల్లోనే స్వచ్ఛత కోల్పోతుందని చెబుతున్నారు. ఆక్సీకరణం నెమ్మదించాలంటే చెరకు రసంలో కొంచెం నిమ్మరసం లేదా ఐస్‌ను వాడొచ్చు.

News April 19, 2025

బేగంపేట: యముడు, చిత్రగుప్తుడి అవతారం ఎత్తారు

image

బేగంపేట చౌరస్తాలో NIPPON ఎక్స్‌ప్రెస్ CSR కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా వాహనదారులకు వినూత్న రీతిలో పోలీసులు యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో ట్రాఫిక్ నిబంధనలపై అవేర్నెస్ కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హెల్మెట్, సీటు బెల్టులేని వారికి వాటి ఆవశ్యకతను వివరించారు. ట్రాఫిక్ ఏసీపీ వెంకటేశ్వర్లు, CI రామచందర్, బోస్‌కిరణ్, SI భూమేశ్వర్, NIPPON సుధీర్ నాయర్, కలీంఅలీ, అనిల్, ప్రియాంక సుధాకర్ సిబ్బంది ఉన్నారు.

News April 19, 2025

పెద్దపల్లి: PACS కొనుగోలు కేంద్రాలు సిద్ధం

image

పెద్దపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధమయ్యాయి. పీఏసీఎస్ పరిధిలో 200కు పైగా కొనుగోలు కేంద్రాలకు రైతుల తమ ధాన్యాన్ని తరలిస్తున్నారు. దాదాపు 90% వరి కోతలు పూర్తయ్యాయి. మరో నెల రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ కూడా పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు.

error: Content is protected !!