News April 13, 2025
శాంతి భద్రతలను పర్యవేక్షించిన ADB SP

ఆదిలాబాద్‌లో భారీ ఎత్తున జరిగిన హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా పోలీసు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం జరిగిన శోభాయాత్రలో బందోబస్తు ప్రక్రియను డ్రోన్ ద్వారా, మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనంలో సీసీ కెమెరాల ద్వారా ఎస్పీ పరిశీలించారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా 300 పోలీసు సిబ్బందితో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News April 13, 2025
MNCL: పసి పాప ప్రాణం తీసిన పాము

లక్షెట్టిపేట మండలం వెంకట్రావ్ పేటలో విషాదం చోటు చేసుకుంది. పాముకాటుతో ముక్కుపచ్చలారని చిన్నారి కన్నుమూసింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన జాడి సుధాకర్ నాలుగేళ్ల కుమార్తె ఉదయశ్రీ శనివారం సాయంత్రం పాముకాటుతో మృతి చెందింది. ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా పాము కాటు వేయడంతో వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా మృతి చెందింది.
News April 13, 2025
ADB : BRS సిద్ధమా..పూర్వ వైభవం వచ్చేనా..!

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత స్తబ్దుగా ఉన్న BRS రజతోత్సవ సభ ఏర్పాటుచేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ శ్రేణులకు ఇప్పటికే మాజీ మంత్రి జోగు రామన్న, MLA అనిల్ జాదవ్, ఖానాపూర్ ఇన్‌ఛార్జ్ జాన్సన్‌నాయక్ దిశానిర్దేశం చేశారు. సభకు భారీగా తరలివెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా సమాయత్తమవుతున్నారు. ఇది స్థానిక పోరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
News April 13, 2025
ఆదిలాబాద్: రేపు ITI కళాశాలలో అప్రెంటిషిప్ మేళా

ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 14న జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని ఐటీఐ ఉత్తీర్ణులైనా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారంగా స్టైపెండ్‌ను శిక్షణ కాలంలో నేరుగా అభ్యర్థుల ఖాతాలకు జమ చేస్తాయన్నారు.