News January 10, 2026
శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు: పవన్

AP: మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసే శక్తుల పట్ల అప్రమత్తత అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ పోలీస్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడకుండా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూంలో డయల్ 100 పనితీరుపై అధికారులను ఆరాతీశారు. అంతకుముందు పిఠాపురంలో గొల్లప్రోలు హౌసింగ్ వద్ద నిర్మించిన నూతన బ్రిడ్జిని ఆయన పరిశీలించారు.
Similar News
News February 19, 2026
రేపు ఢిల్లీ ఏఐ సమ్మిట్‌కు CM చంద్రబాబు

AP: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో పాల్గొంటారు. అక్కడికి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. IBM, UNICC, NIELIT సంస్థలతో ఈ ఒప్పందాలు జరగనున్నాయి. UK మంత్రి, ఆరామ్‌కో ఇండియా, అడోబ్ ఇండియా సీఈఓలతో చంద్రబాబు సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం ఢిల్లీ నుంచి తిరిగి అమరావతికి చేరుకుంటారు.
News February 19, 2026
ఎప్‌స్టీన్ ఫైల్స్: బ్రిటన్ మాజీ ప్రిన్స్ అరెస్ట్

బ్రిటన్ మాజీ యువరాజు (ప్రిన్స్) ఆండ్రూను పోలీసులు అరెస్టు చేశారు. ఈస్టర్న్ ఇంగ్లండ్‌లోని ఆయన నివాసానికి 6 కార్లలో వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ‘ప్రభుత్వ కార్యాలయంలో తప్పుడు ప్రవర్తన’ కింద అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడం గమనార్హం. కాగా అమెరికా లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్‌కు ఆండ్రూ కీలకమైన వాణిజ్య నివేదికలు పంపినట్లు ఆరోపణలున్నాయి.
News February 19, 2026
ECIL 200 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

HYDలోని <


