News March 26, 2025

శాంతి భద్రతల సమీక్షలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, ఎస్పీలు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన శాంతిభద్రతల సమీక్షలో శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్, ఎస్పీలు పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో శాంతిభద్రతలపై జరిగిన సమీక్షలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్నలు ప్రజెంటేషన్ ఇచ్చారు.

Similar News

News February 17, 2026

రాగి పంటకు నీరు అందించడంలో జాగ్రత్తలు

image

రాగి పంటకు నీటిని అందించే విషయంలో రైతులు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. నాట్లు వేసిన రాగి పొలంలో పైరు బాగా వేర్లు తొడిగే వరకు అంటే సుమారు 10 రోజుల వరకు నీరు పెట్టకూడదని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రాగి పంట సాధారణంగా వర్షాధార పంట అయినప్పటికీ కీలక దశలైన మొలకెత్తే దశ, పూత, గింజ పాలు పోసుకునే దశల్లో నీటి తడులను ఇస్తే దిగుబడి బాగుంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.

News February 17, 2026

ఇన్‌కమ్ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో 46 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్, గుజరాత్‌ స్పోర్ట్స్ కోటాలో 46 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, టెన్త్ అర్హతతో పాటు క్రీడల్లో( జాతీయ, అంతర్జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ, ఖేలో ఇండియా ) పతకాలు సాధించినవారు FEB 21 వరకు అప్లై చేసుకోవచ్చు. MTS పోస్టులకు 18-25ఏళ్ల మధ్య, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు 18-27ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: incometaxgujarat.gov.in

News February 17, 2026

జహీరాబాద్ మున్సిపల్ పీఠం.. వీడిన ఉత్కంఠ

image

జహీరాబాద్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఛైర్మన్‌గా 5వ వార్డు కౌన్సిలర్ యూనుస్, వైస్ ఛైర్మన్‌గా 16వ వార్డు కౌన్సిలర్ శిరీష రెడ్డి ఎన్నికయ్యారు. సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్, ఖేడ్, కోహీర్ కాంగ్రెస్ కైవసం చేసుకోగా, పటాన్‌చెరు పరిధిలోని 5 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించుకుంది. ఈ ఎన్నిక రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది.