News January 12, 2026

శాంసంగ్‌కు చెక్.. టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా యాపిల్

image

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో యాపిల్ కంపెనీ నంబర్ వన్‌గా నిలిచింది. ఐఫోన్ 17 సక్సెస్, 16కు భారీ డిమాండ్, సేల్స్‌లో 10 శాతం గ్రోత్ సాధించడంతో గత 14 ఏళ్లలో తొలిసారిగా టాప్‌లోకి వచ్చింది. శాంసంగ్‌ రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ 20%, శాంసంగ్ 19%, షియోమీ 13%, వివో 8%, ఒప్పో 8%, ఇతర బ్రాండ్లు 32% వాటా కలిగి ఉన్నాయి.

Similar News

News February 17, 2026

‘రామాయణ’ కోసం రెహమాన్ డిజిటల్ డిటాక్స్

image

నితేశ్ తివారీ ‘రామాయణ’ సినిమాకు జిమ్మర్‌తో కలిసి రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. మూవీ యూనిట్‌ను పరిచయం చేయడానికి మార్చిలో ఓ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు. దీనిపై ఫోకస్ చేయడానికి రెహమాన్ 40 రోజులు డిజిటల్ డిటాక్స్ పాటించనున్నట్లు ప్రకటించారు. ‘జిమ్మర్, నేను కలిసి ఓ ఐకానిక్ మ్యూజిక్ చేస్తున్నాం. అణువణువు రామాయణం, సంస్కృతిని నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు.

News February 17, 2026

పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్

image

డిజిటల్ ఇండియాను ప్రమోట్ చేసేందుకు కేంద్రం నిర్వహిస్తున్న ఏఐ సమ్మిట్‌లో యూపీఐకి ఆప్షన్ లేకపోవడం చర్చనీయాంశమైంది. అక్కడి ఫుడ్ స్టాల్స్‌.. ‘నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్’ అంటున్నాయి. UPI ఉంటుందిలే అనే ధీమాతో అక్కడికి వచ్చిన వారు చెల్లింపులకు ఇబ్బంది పడ్డారు. ఒకపక్క నో క్యాష్.. నో కార్డ్.. ఓన్లీ యూపీఐ అని ప్రమోట్ చేస్తుంటే ఇక్కడ సీన్ రివర్స్‌లో ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.

News February 17, 2026

హెయిర్ బొటాక్స్ గురించి తెలుసా?

image

జుట్టు పల్చగా ఉండే వారికి సరికొత్త రూపాన్ని ఇస్తుంది హెయిర్ బొటాక్స్. ఇది లోతైన కండిషనింగ్ ట్రీట్మెంట్. హెయిర్ ఫైబర్లని కెరాటిన్ ఫిల్లర్‌తో భర్తీ చేస్తుంది. ఇది మీ జుట్టుకు మంచి కండిషనింగ్ ఇస్తుంది. స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ డామేజ్, పెళుసు జుట్టు, నిర్జీవమైన జుట్టు ఉన్నవారు ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్‌లో కెరాటిన్, కొల్లాజెన్, విటమిన్స్ B5, విటమిన్ E వాడతారు.