News July 7, 2025
శాకాంబరీ ఉత్సవాల్లో భద్రకాళి అమ్మవారి దర్శనం

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో నిర్వహిస్తున్న శాకాంబరీ మహోత్సవాల్లో భాగంగా పన్నెండవ రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసం ద్వాదశి తిథి సోమవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతినిచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.
Similar News
News July 7, 2025
జగిత్యాల జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

జగిత్యాల జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలు. అత్యధికంగా బీర్పూర్ మండలం కొల్వాయిలో 23.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా అత్యల్పంగా కొడిమ్యాల మండలం పూడూరులో 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జగిత్యాలలో 18.5, మల్లాపూర్ 16, మేడిపల్లి 13.5, వెల్గటూర్ 11.3 సారంగాపూర్ 10, కథలాపూర్ 9.8, మెట్‌పల్లి, ఎండపల్లిలో 9.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
News July 7, 2025
HYD: అన్ని రోడ్లు ఇలా చేస్తే ఎంత బాగుండో.!

HYD శివారు గౌలిదొడ్డి ప్రధాన రహదారి అత్యంత ప్రమాదకరంగా గుంతల మయంగా మారింది. వాహనదారులు నరకయాతన అనుభవించేవారు. స్థానికులు, ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి సమస్యలను పరిష్కరించారు. దీంతో HYD నగర వ్యాప్తంగా అన్ని రోడ్లలో ఇలా చేస్తే ఎంత బాగుండోనని అంటూ X వేదికగా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.