News October 29, 2025

శాతవాహన ఎక్స్‌ప్రెస్.. జనగాంలో అదనపు స్టాప్

image

సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలుకు జనగాం స్టేషన్‌లో అదనపు స్టాప్ ప్రకటించింది. ప్రయోగాత్మకంగా అక్టోబర్‌ 30, 2025 నుంచి అమల్లోకి రానుంది. విజయవాడ- సికింద్రాబాద్‌ ఉ.10:14, సికింద్రాబాద్- విజయవాడ సా.17:19కి జనగాం చేరుకొని, నిమిషం పాటు వెయిట్ చేస్తుందని పేర్కొంది.

Similar News

News October 29, 2025

రేపటి నుంచి యధావిధిగా పాఠశాలలు: డీఈవో

image

జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు గురువారం నుంచి యధావిధిగా పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను మండల విద్యాశాఖ అధికారులకు పంపించారు. ప్రదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ముందుగానే పాఠశాలలకు వెళ్లి అక్కడ పరిస్థితులు గమనించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. పాఠశాల ప్రాంగణంలో శానిటేషన్ పనులు చేయించాలని సూచించారు.

News October 29, 2025

విషాదం: 10 రోజులకే వీడిన బంధం.. నవవధువు మృతి

image

NLG: గుర్రంపోడు(M)లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ నవవధువు మృతి చెందగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. చామలేడుకు చెందిన సిలువేరు నవీన్, 10 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న తన భార్యతో కలిసి బైక్‌పై గుర్రంపోడుకు వెళుతున్నారు. వారు బ్రిడ్జిపై ప్రయాణిస్తుండగా, ఎదురుగా మలుపు తిప్పుతున్న మరో బైక్‌ను చూసి నవీన్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో దంపతులిద్దరూ బైక్‌పై నుంచి ఎగిరి పడగా ఈ దుర్ఘటన జరిగింది.

News October 29, 2025

సిరిసిల్ల కలెక్టర్‌కు బండి సంజయ్ ఫోన్

image

మొంథా తుపాన్ నేపథ్యంలో జిల్లాలో గల రైతులను, అన్ని వర్గాల ప్రజలను అప్రమత్తం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు ఫోన్ ద్వారా సూచించారు. భారీ వర్షం, వరద నష్టంపై అడిగి తెలుసుకున్నారు. వర్ష ప్రభావిత ప్రాంతంలో పర్యటించాలని అధికారులను ఆదేశించారు. మండల వారీగా సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు.