News January 1, 2026
శాతవాహన పరిశోధన అభివృద్ధి కేంద్ర సంచాలకులుగా డాక్టర్ జాఫర్

శాతవాహన విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ & డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్ గా డా.మహమ్మద్ జాఫర్ నియమకయ్యరు. ఈ మేరకు SU VC ఆచార్య యు.ఉమేష్ కుమార్ చేతుల మీదుగా ఉత్తర్వులు అందుకున్నారు. జాఫర్ ఉర్దూ విభాగంలో సహ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్, జాతీయ సేవా పథకం సమన్వయకర్త, యూనివర్సిటీ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ గా పని చేశారు. 2020లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా అవార్డు అందుకున్నారు.
Similar News
News January 6, 2026
ఆ వీడియోలు చూస్తే వారికి తెలిసిపోతుంది!

TG: చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన వారిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో కఠిన చర్యలు తీసుకుంటోంది. ఆన్‌లైన్‌లో అశ్లీల వీడియోలు బ్రౌజ్ చేసినా, డౌన్‌లోడ్ లేదా షేర్ చేసినా వెంటనే అలర్ట్ వెళ్లేలా ఓ నెట్‌వర్క్ పనిచేస్తోంది. గత ఏడాది 97,556 సైబర్ టిప్ లైన్ అలర్ట్స్ అందగా, 854 కేసులు నమోదు చేసి 376 మందిని అరెస్ట్ చేశారు. 1,635 అనుమానితుల ప్రొఫైల్స్ మానిటరింగ్‌లో ఉన్నాయి. ఐపీ అడ్రెస్‌ల ఆధారంగా గుర్తిస్తున్నారు.
News January 6, 2026
NLG: ట్రాన్స్ జెండర్లకు గుడ్ న్యూస్

ట్రాన్స్‌జెండర్ల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ‘ఉపాధి పునరావాస పథకాన్ని’ ప్రవేశపెట్టిందని జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి తెలిపారు. వ్యవసాయం, వ్యాపారం లేదా సేవా రంగాల్లో స్వయం ఉపాధి పొందాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అర్హులైన వారు ఈ నెల 12వ తేదీలోపు జిల్లా సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా ట్రాన్స్ జెండర్లు గౌరవప్రదమైన జీవనం గడపవచ్చన్నారు.
News January 6, 2026
యూరియా నిల్వలు పుష్కలం: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 12,682 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే 25,773 టన్నుల ఎరువులను పంపిణీ చేశామని వివరించారు. పంపిణీ కేంద్రాల వద్ద రైతులకు నీడ, తాగునీటి వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. ఎరువుల సరఫరాలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.


