News April 8, 2025
శాతవాహన వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

శాతవాహన యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 39 మంజూరు పోస్టులకు గాను 16 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 21 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
Similar News
News April 17, 2025
ASF: వైద్య సిబ్బందికి DMHO హెచ్చరికలు

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి సీతారాం అన్నారు. బుధవారం చింతలమానేపల్లి మండలం దిందా పల్లె దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు వైద్యం అందుబాటులో తీసుకొచ్చేందుకు పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం కుష్టు వ్యాధి నిర్మూలనపై అవగాహన కల్పించారు.
News April 17, 2025
మల్లీశ్వరి సూసైడ్.. వనపర్తి జిల్లాలో ఆందోళన

నల్గొండ జిల్లాకు చెందిన దళిత యువతి మల్లీశ్వరి కుల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటనపై చిన్నంబావి అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఆమె మరణంపై ప్రభుత్వం కావాలని నిజాన్ని దాచి నిందితులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు.
News April 17, 2025
పోలీసులు బాధ్యతతో మెలగాలి: KMR ఎస్పీ

ప్రతి పోలీసు అధికారి తమ విధులను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో రిసెప్షన్ వర్టికల్ పోలీసు సిబ్బందితో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పిటిషన్ దారుడు ఇచ్చే పిటిషన్ను తక్షణమే నమోదు చేసి, వెంటనే రసీదు ఇవ్వాలని రిసెప్షన్ వర్టికల్ అధికారులకు సూచించారు.