News January 3, 2026

శాతవాహన వర్సిటీ రిజిస్ట్రార్‌గా ప్రొ. సతీష్ కుమార్

image

శాతవాహన విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ పెద్దపల్లి సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ విభాగం అధిపతిగా, పరీక్షల విభాగం కాన్ఫిడెన్షియల్ కంట్రోలర్‌గా ఆయనకు విశేష అనుభవం ఉంది. గతంలో బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గానూ సతీష్ కుమార్ సమర్థవంతంగా సేవలు అందించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News February 14, 2026

MDK: పార్టీ మారి గెలిచినా.. ఆశలు గల్లంతు!

image

రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 5వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ చరిత విజయం సాధించారు. కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో ఆమె తండ్రి సుప్రభాత్ రావు బీఆర్‌ఎస్‌లో చేరి కుమార్తెను గెలిపించుకున్నారు. అయితే మున్సిపల్ పీఠం దక్కించుకోవడంలో బీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించలేకపోవడంతో ఛైర్మన్ పదవిపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. గెలిచినా నిరాశే ఎదురైంది.

News February 14, 2026

వరంగల్ బల్దియాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు!

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారులు అర్హతలేని 15 మందికి అక్రమ మార్గాన ఉద్యోగాలు కట్టబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞాన అర్హత లేని వారికి అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఉద్యోగాలు కట్టబెట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో వ్యక్తి నుంచి రూ.1,50,000 పుచ్చుకొని చైన్‌మెన్ ఉద్యోగాలు కల్పించినట్లు బల్దియాలో చర్చ జరుగుతోంది.

News February 14, 2026

రైతును రాజుగా మార్చడమే మా లక్ష్యం: అచ్చెన్నాయుడు

image

రాష్ట్రంలో రైతును రాజుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని AP వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. యువత వ్యవసాయంవైపు మళ్లాలంటే సాగును లాభదాయక వృత్తిగా మార్చాలని అభిప్రాయపడ్డారు. దీని కోసం ప్రకృతి వ్యవసాయం, సాగులో సాంకేతికత, పండిన పంటకు గిట్టుబాటు ధర, కోత అనంతర పంట నష్టాలను తగ్గించడం, అధిక ఆదాయం వచ్చే పంటలవైపు రైతులను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు.