News January 23, 2026

శాతావాహన యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా

image

TG: కరీంనగర్‌లోని శాతావాహన యూనివర్సిటీలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 50 కంపెనీలు IT, ఫార్మా, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రిటైల్, FMCG, మేనేజ్‌మెంట్ విభాగంలో 5వేల పోస్టులను భర్తీ చేయనున్నాయి. బీటెక్, ఎంటెక్, డిగ్రీ, పీజీ, ఫార్మా, నర్సింగ్ అర్హత గల అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వర్సిటీ, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

Similar News

News February 18, 2026

ఫాల్గుణ మాసం: ఈ వ్రతం చేస్తే ఎంతో పుణ్యం

image

ఫాల్గుణ మాసంలో వయో వ్రతాన్ని ఆచరిస్తారు. దీన్నే ‘సర్వయజ్ఞ ఫలప్రదం’ అంటారు. అదితి దేవి తన కుమారులైన దేవతలకు తిరిగి స్వర్గరాజ్యం లభించాలని ఈ వ్రతాన్ని ఆచరించిందట. అలా వామనుడిని పుత్రుడిగా పొందిందని పురాణ గాథ. కోరిన కోరికలు నెరవేరడానికి, సంతాన ప్రాప్తికి, ఐశ్వర్యాన్ని పొందడానికి, కష్టాల నుంచి విముక్తి కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. దీన్ని అన్ని వ్రతాలలోకెల్లా ఉత్తమమైనదిగా పరిగణిస్తారు.

News February 18, 2026

మలైకా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

image

50ఏళ్లు దాటినా ఇంకా ఫిట్ & యంగ్‌గా కనిపిస్తుంటారు బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఆమె టోన్డ్ బాడీ, ఫ్లాట్ యాబ్స్, గ్లోయింగ్ స్కిన్ చూస్తే యూత్‌ కూడా జలసీ ఫీల్ అవ్వాల్సిందే. దీనికోసం యోగాతో పాటు హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT) చేస్తానని మలైకా ఓ ఇంటర్వూలో వెల్లడించారు. వీటితో పాటు పైలేట్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫుల్-బాడీ వర్కౌట్‌లతో సహా వివిధ రకాల వ్యాయామాలను చేయడానికి ఇష్టపడతానని తెలిపారు.

News February 18, 2026

సభ ప్రారంభమైన 5 నిమిషాలకే వాయిదా

image

AP: శాసనమండలిలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈరోజు సభ ప్రారంభమైన 5 నిమిషాలకే వాయిదా పడింది. ఇందాపూర్ డెయిరీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ వైసీపీ MLCలు నిరసనకు దిగారు. ఆందోళనల మధ్య ఛైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు. వైసీపీ సభ్యులు దేవుడిపై రాజకీయాలు చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారని హోంమంత్రి అనిత విమర్శించగా, ప్రభుత్వమే శ్రీవారిపై రాజకీయాలు చేస్తోందని YCP పక్షనేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.