News October 14, 2025

శామీర్‌పేట్: కలెక్టరేట్ ముందు ఎమ్మార్పీఎస్ ధర్నా

image

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయిపై రాకేశ్ కిషోర్ అనే అడ్వకేట్ షూ విసరడాన్ని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ ముందు ఎమ్మార్పీఎస్ నాయకులు ఈరోజు ధర్నా చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. న్యాయమూర్తులకు రక్షణ కరవైందన్నారు.

Similar News

News October 14, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 14, 2025

MHBD: లిక్కర్ షాపులకు 113 దరఖాస్తులు

image

మహబూబాబాద్ జిల్లాలో లిక్కర్ షాపులకు మొత్తం 113 దరఖాస్తులు వచ్చినట్లు మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐ చిరంజీవి తెలిపారు. సోమవారం ఒక్క రోజే 56 దరఖాస్తులు వచ్చాయన్నారు. మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్‌లో ఆదివారం 25 దరఖాస్తు రాగ మొత్తం 59 దరఖాస్తులు వచ్చాయని సీఐ తెలిపారు. లిక్కర్ షాపులకు దరఖాస్తులకు ఈనెల 18న గడువు ముగుస్తుందన్నారు.

News October 14, 2025

వచ్చే నెల నుంచి ముఖ ఆధారిత హాజరు: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో వచ్చే నెల నుంచి ముఖ ఆధారిత హాజరు అమల్లోకి వస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందుకు అవసరమైన ఈకేవైసీని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి కూలీలకు కనీస వేతనం గిట్టుబాటు అయ్యే విధంగా పనులు కల్పించాలన్నారు. ప్రతి మండలంలో ఒక మ్యాజిక్ డ్రైన్ పూర్తి చేయాలన్నారు.