News February 12, 2026

శాలిగౌరారం: చిన్నారిపై వీధి కుక్క దాడి

image

ఆకారం గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న మనస్వి అనే 15 నెలల చిన్నారిపై వీధి కుక్క దాడి చేసి తలపై తీవ్రంగా గాయపరిచింది. రక్తస్రావం కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది హేమంత్, సమీర్ చిన్నారిని హుటాహుటిన నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కల బెడదపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 12, 2026

పారదర్శకంగా ఓట్ల లెక్కింపు చేపట్టాలి: కలెక్టర్ చంద్రశేఖర్

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల పరిశీలకుడు జి.రమేష్‌తో కలిసి ఆర్జాలబావిలోని కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తామని తెలిపారు.

News February 12, 2026

నల్గొండ: మున్సిపల్ పోరులో ‘సింహం’ గర్జిస్తుందా?

image

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో AIFB అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పార్టీల టికెట్లు దక్కని పలువురు నేతలు ‘సింహం’ గుర్తుపై పోటీకి దిగారు. మొత్తం 48 డివిజన్లలో ఫార్వర్డ్ బ్లాక్ తరఫున 11 మంది బరిలో నిలవగా, ఐదుగురు అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తామని ధీమాగా ఉన్నారు. రేపు వెలువడనున్న ఫలితాల్లో సింహం గుర్తు ఏ మేరకు ప్రభావం చూపుతుందోనని నగరంలో ఆసక్తికర చర్చ సాగుతోంది.

News February 12, 2026

నల్గొండ: భారత్ బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

image

కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు చేపట్టిన ‘భారత్ బంద్’కు కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటించింది. లేబర్ కోడ్‌ల రద్దు, అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటంలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, ర్యాలీల్లో పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.