News February 3, 2025
శావల్యాపురం: కాలువలో పడి తూ.గో జిల్లా యువకుడి మృతి

శావల్యాపురం మండలం ఘంటవారిపాలేం కాలువలో గుర్తుతెలియని ఓ యువకుడి మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కాలువలోంచి బయటకు తీశారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి జేబులో ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లి రాజేశ్ (25)గా గుర్తించారు.
Similar News
News January 3, 2026
విశాఖ: సొంత భవనంలోకి NIO ప్రాంతీయ కార్యాలయం

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫి విశాఖ ప్రాంతీయ కార్యాలయం త్వరలో సొంత భవనంలోకి మారనుంది. సముద్ర తీర పరిశోధనల కోసం 1976 నుంచి పెదవాల్తేరు బస్ డిపో సమీపంలో అద్దె భవనంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా బీచ్ రోడ్డులోని రాడిసన్ బ్యూ రిసార్ట్ సమీపంలో 3 ఎకరాల్లో నూతన భవన నిర్మాణం పూర్తయింది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనాన్ని త్వరలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News January 3, 2026
సంగారెడ్డి: గ్రామాని కో సమైక్య సంఘం భవన నిర్మాణం

గ్రామస్థాయిలో మహిళా సాధికారతకు ప్రభుత్వం తాజాగా సమైక్య సంఘం భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. NREGS కింద ఒక్కో భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు ఖర్చు చేయనున్నారు. జిల్లాలో 613 జీపీల్లో 1.94 లక్షల మంది సభ్యులతో 18.848 మహిళా సంఘాలు, 613 గ్రామైక్య సంఘాలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో భవన నిర్మాణానికి 200 చదరపు గజాల్లో స్లాబ్‌తో వర్క్ షెడ్ నిర్మించనున్నారు.
News January 3, 2026
యాదాద్రి: నేటి నుంచే ‘టెట్’.. సర్వం సిద్ధం

టెట్ శనివారం నుంచి ఈనెల 31 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో జరగనుంది. ప్రతిరోజూ 2 విడతల్లో (ఉదయం 9-12, మధ్యాహ్నం 2.30-5) పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 6,852 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అయితే, దేశ్‌ముఖి విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో మాత్రం 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.


