News February 2, 2025

శావల్యాపురం: కాలువలో యువకుడి మృతదేహం లభ్యం

image

శావల్యాపురం మండలం ఘంటేవారిపాలెం కాలువలో ఆదివారం ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  

Similar News

News February 2, 2025

జానారెడ్డితో పార్టీ పునర్వ్యవస్థీకరణపై మహేశ్ కుమార్ చర్చ

image

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫోన్‌లో ఆదివారం కీలక చర్చ జరిపారు. కాంగ్రెస్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను సమీక్షించడం వంటి అంశాలపై ఇద్దరి మధ్య చర్చ సాగినట్లు సమాచారం. ఈ సందర్భంగా గాంధీభవన్ వైపు అప్పుడప్పుడు రావాలని, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని జానారెడ్డిని కోరారు.

News February 2, 2025

CM రేవంత్‌ను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చూపించాలి: RS ప్రవీణ్

image

TG: KCR శారీరక స్థితి గురించి ఇటీవల CM రేవంత్ చేసిన <<15322522>>వ్యాఖ్యలపై<<>> BRS నేత RS.ప్రవీణ్ మండిపడ్డారు. ‘రేవంత్ మానసిక స్థితిపై అనుమానాలున్నాయి. ఆయన మాటలు చూస్తుంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్, బైపోలార్ డిజార్డర్ రోగి లక్షణాలుగా కనిపిస్తున్నాయి. CM బాధ్యతలు ఎవరికైనా తాత్కాలికంగా అప్పజెప్పి వారిని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చూపిస్తే బాగుంటుందేమో. దీని గురించి వారి ఫ్యామిలీ ఆలోచించాలి’ అని పేర్కొన్నారు.

News February 2, 2025

NZB: కేంద్రంపై MLC కవిత ఫైర్

image

జనగణనపై నిజామాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని నిలదీశారు. జనగణన ఇంకెప్పుడు చేస్తారని ప్రశ్నించారు. జనాభా లెక్కలు లేకుండా దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితి ఎలా తెలుస్తుందన్నారు. ప్రగతిశీల విధానాలకు జనాభా లెక్కలు తప్పనిసరి అని పేర్కొంటూ జనగణనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.