News November 21, 2024

శాసనమండలిలో భూ సమస్యలపై MLC వెంకటేశ్వరరావు గళం

image

శాసనమండలిలో భూ సమస్యలపై తూ.గో, ప.గో జిల్లాల పట్టభధ్రుల MLC వెంకటేశ్వరరావు గళం వినిపించారు. ఆన్‌లైన్‌లో భూమి రకం, విస్తీర్ణాలు తప్పుల తడకగా చూపిస్తున్నాయని అన్నారు. అంతే కాకుండా తక్కువ భూమి ఉన్న వారికి ఎక్కువ భూమి చూపిస్తూ ఉండడంతో వారు సంక్షేమ పథకాలు కోల్పోతున్నారని ఆయన వివరించిన తీరు ఆకట్టుకుంది. రైతులు అధికారుల చుట్టూ తిరిగినా సమస్య తీరడం లేదన్నారు. దీనికి పరిష్కారం చూపాలని కోరారు.

Similar News

News December 3, 2024

పవన్ లుక్: కాకినాడలో అలా.. క్యాబినెట్‌లో ఇలా!

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లుక్ మారింది. మూడ్రోజుల క్రితం కాకినాడ పోర్టుకు వెళ్లిన ఆయన గడ్డంతో కనిపించారు. మాస్ లుక్‌లో ‘సీజ్‌ ద షిప్‌’ అంటూ ఆయన చేసిన కామెంట్ నెట్టింట హల్‌చల్‌ చేసింది. తర్వాత ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో పాల్గొన్న పవర్ స్టార్ క్లీన్ షేవ్ చేసుకున్నారు. నిన్న సెట్స్ నుంచి సెల్ఫీ సైతం పోస్ట్ చేశారు. ఇవాళ క్యాబినెట్ సమావేశంలో పవన్ పాల్గొనగా ఆయన కొత్త లుక్‌కు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

News December 3, 2024

ఉమ్మడి తూ.గో. జిల్లాలో రెండు రోజులు మద్యం బంద్

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో MLC ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నేటి సాయంత్రం 4 గంటల నుంచి 5వ తేదీ వరకు పోలింగ్ కేంద్రాల సమీపంలో మద్యం షాపులు మూసి వేయనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. సోమవారం రాత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల దృష్ట్యా మద్యాన్ని విక్రయిస్తే చట్ట రీత్యా నేరమని, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

News December 3, 2024

కాకినాడ: ‘ఎమ్మెల్సీ పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించాలి’

image

ఈ నెల 5న జిల్లాలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఏఆర్వో జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో పోలింగ్ అధికారులు, సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జె.వెంకటరావు హాజరయ్యారు.