News October 28, 2024

శాసనసభ పబ్లిక్ అకౌంట్ సమావేశంలో పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే

image

హైదరాబాద్ శాసనసభ పబ్లిక్ అకౌంట్ సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యయం- పద్దులు, నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలనలో ప్రజా సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.

Similar News

News December 26, 2025

MBNR: ప్రజా భద్రతే లక్ష్యం: ఎస్పీ

image

MBNR జిల్లాలో నేరాల నియంత్రణకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయని, గత ఏడాదితో పోలిస్తే నేరాలు 5 శాతం తగ్గాయని ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 2025 వార్షిక నేర నివేదికను ఆమె విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికలను పకడ్బందీ భద్రతతో ప్రశాంతంగా నిర్వహించామన్నారు. మహిళల రక్షణకు షీ టీమ్స్, భరోసా కేంద్రాల భద్రత కల్పిస్తున్నామన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందన్నారు.

News December 26, 2025

MBNR: నేడు వార్షిక నేర నివేదిక విడుదల

image

మహబూబ్ నగర్ పట్టణంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డి.జానకి సమావేశం నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ రిలేషన్స్ అధికారి (పీఆర్ఓ) శ్రీనివాసులు “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 వార్షిక నేర నివేదిక (Annual Crime Review) అన్యువల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మీడియా ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.

News December 25, 2025

MBNR: రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్.. రన్నర్‌గా పాలమూరు

image

రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ మెదక్‌లోని మనోహరాబాద్‌లో నిర్వహించారు. ఈ టోర్నీలో మహబూబ్‌నగర్ బాలికల జట్టు రన్నర్స్ (2వ స్థానం)లో నిలిచిందని జిల్లా సాఫ్ట్ బాల్ అధ్యక్షుడు అమరేందర్ రాజు ‘Way2News’ప్రతినిధితో తెలిపారు. బాలికల విజయం పట్ల సంఘం సభ్యులు రాఘవేందర్, నాగరాజు, ఉమ్మడి జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు. కోచ్, మేనేజర్‌గా లక్ష్మీనారాయణ, సునీత వ్యవహరించారు.