News December 31, 2025
శాస్త్రీయ దృక్పథంతోనే ప్రగతి: కలెక్టర్ తేజస్

విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించేందుకు సైన్స్ ఫెయిర్‌లు దోహదపడతాయని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. బుధవారం హుజూర్‌నగర్‌లో జరిగిన 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు రూపొందించిన నూతన సాంకేతిక నమూనాలను అభినందించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
Similar News
News February 14, 2026
రిటైర్మెంట్ లైఫ్ ఫుల్ సేఫ్.. పెన్షన్ + హెల్త్ కవర్‌కు PFRDA ప్లాన్!

ఇకపై పెన్షన్ స్కీమ్స్‌తో పాటే హెల్త్ కవర్‌నూ అందించేందుకు PFRDA ప్లాన్ చేస్తోంది. రిటైర్మెంట్ తర్వాత వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది లేకుండా ఇన్వెస్టర్ల డబ్బులో 30% వైద్య అవసరాలకు కేటాయించేలా ‘Swasthya’ ప్లాన్‌ను రూపొందించే యోచనలో ఉంది. పెన్షన్ ఫండ్స్ స్పాన్సర్ చేసే ICICI, Axis, Tata వంటివి దీనిపై కసరత్తు చేస్తున్నాయి. దీంతో తక్కువ ప్రీమియంతోనే ఇన్సూరెన్స్, హాస్పిటల్స్‌లో మంచి డిస్కౌంట్లు లభిస్తాయి.
News February 14, 2026
NGKL: ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి!

NGKL జిల్లా ఊర్కొండ మండల తిమ్మనపల్లి గేటు వద్ద తెల్లవారుజామున విషాదం నెలకొంది. శ్రీశైలం వెళ్తున్న కర్ణాటక భక్తుల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
News February 14, 2026
రూ.19.60 లక్షల వేతనంతో ఉద్యోగం

‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’ అన్న మాటను పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువుకు చెందిన షేక్ కరిష్మా నిజం చేశారు. బీటెక్ CSE ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆమె ఆస్ట్రేలియాకు చెందిన రైజ్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్‌లో ఎంపికయ్యారు. ఏకంగా ₹19.60లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించినట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది. పేద కుటుంబం నుంచి వచ్చిన కరిష్మా, పట్టుదలతో ఈ విజయం సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.


